“ఎవరైతే సూర్యుడు ఉదయించడానికి ముందున్న నమాజును (సలాహ్’ను) మరియు సూర్యుడు అస్తమించడానికి ముందున్న నమాజును…

“ఎవరైతే సూర్యుడు ఉదయించడానికి ముందున్న నమాజును (సలాహ్’ను) మరియు సూర్యుడు అస్తమించడానికి ముందున్న నమాజును ఆచరిస్తాడో అతడు నరకాగ్నిలోనికి ప్రవేశించడు

అబూ జుహైర్ ఉమారహ్ ఇబ్న్ రుఐబహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే సూర్యుడు ఉదయించడానికి ముందున్న నమాజును (సలాహ్’ను) మరియు సూర్యుడు అస్తమించడానికి ముందున్న నమాజును ఆచరిస్తాడో అతడు నరకాగ్నిలోనికి ప్రవేశించడు

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే ఫజ్ర్ మరియు అస్ర్ నమాజులను ఆచరిస్తారో, మరియు ఆ నమాజులను ఆచరించుటలో స్థిరత్వాన్ని కలిగి ఉంటారో వారు నరకాగ్నిలోనికి ప్రవేశించరు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ రెండు నమాజులను ఎందుకు ప్రత్యేకించినారు అంటే, అవి (విశ్వాసులపై) భారమైనవి (గా చూడబడతాయి); ఎందుకంటే ఫజ్ర్ నమాజు సమయమున అతడు తన గాఢ నిద్రను ఆనందిస్తుంటాడు; అస్ర్ నమాజు సమయమున అతడు తన దైనందిన వ్యవహారాలు, వ్యాపారం మొదలైన వాటిలో మునిగి ఉంటాడు. కనుక కఠినంగా, భారంగా ఉన్నప్పటికీ ఎవరైతే ఈ రెండు నమాజులను వదలకుండా ఆచరిస్తాడో, అతడు మిగతా నమాజులను తేలికగా ఆచరిస్తాడు.

فوائد الحديث

ఇందులో ఫజ్ర్ మరియు అస్ర్ నమాజుల యొక్క ఘనత పేర్కొనబడినది. కనుక ఆ నమాజులను ఆచరించుట ఎప్పుడూ వదలరాదు.

ఎవరైతే ఈ రెండు నమాజులను వదలకుండా ఆచరిస్తారో, వారు సోమరితనం నుండి మరియు కపటత్వము నుండి దూరం అవుతారు; మరియు ఇబాదత్ (అల్లాహ్ ఆరాధనను) ప్రేమిస్తారు.

التصنيفات

నమాజు ప్రాముఖ్యత