.

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం: “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా ధరిస్తూ ఉన్న అంగి (చొక్కా, పైవస్త్రం) కొంతకాలానికి క్షీణించినట్లు, మీలో ఎవరి హృదయాలలోనైనా విశ్వాసమూ క్షీణిస్తుంది. కనుక మీ హృదయాలలో విశ్వాసాన్ని నవీకరించమని అల్లాహ్ ను వేడుకొనండి”.

[దృఢమైనది]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: ఏ విధంగానైతే ఒక కొత్త వస్త్రము దీర్ఘ కాలంగా వాడుకలో ఉన్న కొద్దీ క్షీణిస్తూ ఉంటుందో, అలాగే ఒక ముస్లిం హృదయములో విశ్వాసము కూడా క్షీణిస్తూ బలహీన పడుతుంది. ఇది అల్లాహ్ యొక్క ఆరాధనలో ఉపేక్ష, అనాసక్తి, ఉదాసీనత, పాపపు కార్యములకు పాల్బడుట మరియు వాంఛ, కామము, వ్యామోహము వంటి విషయాలకు పాల్బడుట మొదలైన వాటి వల్ల జరుగుతుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పరమోన్నతుడైన అల్లాహ్ ను మనలోని విశ్వాసాన్ని నవీకరించమని, పునరుద్ధరించమని, విధిగా ఆచరించవలసిన ఐదు నమాజులను ఆచరిస్తూ, తరుచూ అల్లాహ్ ను స్మరిస్తూ, పాపకార్యముల నుండి ఆయనను క్షమాపణ వేడుకుంటూ అర్థిస్తూ ఉండాలని బోధిస్తున్నారు.

فوائد الحديث

ఈ హదీసులో, ధర్మము విషయములో మనలో సుస్థిరత మరియు దృఢత్వమును ప్రసాదించమని, మన హృదయాలలో విశ్వాసమును నవీకరించమని అల్లాహ్ ను ప్రార్థిస్తూ ఉండాలనే సూచన ఉన్నది.

విశ్వాసము అంటే, మాటలు, ఆచరణలు మరియు నమ్మకము ; అది విధేయత కారణంగా స్థిరంగా, దృఢంగా ఉంటుంది, మరియు అవిధేయత, పాపకార్యముల వలన బలహీన పడుతుంది.

التصنيفات

విశ్వాసం పెరుగుదల మరియు దాని తరుగుదల