ఓ ప్రజలారా! కేవలం నేను నమాజును ఏ విధంగా ఆచరినానో మీరు చూడాలని, ఆ విధంగా మీరు అనుసరించాలని, నమాజును ఏ విధంగా…

ఓ ప్రజలారా! కేవలం నేను నమాజును ఏ విధంగా ఆచరినానో మీరు చూడాలని, ఆ విధంగా మీరు అనుసరించాలని, నమాజును ఏ విధంగా ఆచరించాలో మీరు నేర్చుకోవాలని మాత్రమే ఇలా చేసినాను” అన్నారు

అబీ హాజిం ఇబ్న్ దీనార్ ఉల్లేఖనం : కొంతమంది మగవారు సహ్’ల్ బిన్ స’ఆద్ అస్’సఈదీ రజియల్లాహు అన్హు వద్దకు వచ్చారు. వారు "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపయోగించిన వేదిక (మింబర్) దేనితో తయారు చేసి ఉంటారు" అనే విషయంలో వాదులాడుకోసాగినారు. వారు అతడిని దాని గురించి అడిగినారు. అతడు ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, అది దేనితో తయారు చేయబడినదో నాకు తెలుసు, అది ఇక్కడికి తీసుకు రాబడి ఇక్కడ స్థాపించబడిన మొదటి రోజునే నేను దానిని చూసాను, (స్థాపించబడిన తరువాత) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై మొదటిసారి కూర్చోవడం కూడా చూసాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరిని ఫలానా స్త్రీ ఇంటికి పంపారు. సహ్’ల్ ఆ స్త్రీ పేరును కూడా చెప్పారు. ఆమెతో “మీ వద్ద ఉన్న వడ్రంగి సేవకుడిని "నేను (మస్జిదులో) ప్రజలను సంబోధించి ప్రసంగించ వలసి వచ్చినపుడు కూర్చోవడానికి గానూ ఎత్తైన ఒక వేదికను తయారు చేయమని" పురమాయించండి” అని చెప్పమని పంపినారు. ఆమె అతనిని (వడ్రంగి సేవకునికి) ఆ పని కొరకు పురమాయించింది. అతడు ఆ వేదికను, అల్-ఘాబా నుండి ‘తమరిస్క్’ వృక్షపు కలపను తెప్పించి దానిని తయారు చేసినాడు. ఆ మెంబర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పంపబడింది. వారు దానిని అదుగో ఇక్కడే స్థాపించమని అదేశించినారు. తరువాత (దాని మెట్లు ఎక్కి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపైకి వెళ్ళడాన్ని, దానిపై ఆయన నమాజు ఆచరించడాన్ని చూసాను. దానిపై ఉండగా ఆయన (“అల్లాహు అక్బర్” అని) తక్బీర్ పలికి నమాజును ప్రారంభించి, దానిపై ఉండగానే రుకూ చేసినారు. తరువాత వారు అడుగులు వెనుకకు వేస్తూ వేదిక మెట్లుదిగి, మెట్ల ప్రక్కన సజ్దా చేసినారు. (రెండు సజ్దాలు చేసిన) తరువాత వారు తిరిగి మెట్లు ఎక్కి వేదికపైకి వెళ్ళినారు. (ఆ విధంగా) వారు నమాజును పూర్తిచేసి ముగించిన తరువాత ప్రజల వైపునకు తిరిగి “ఓ ప్రజలారా! కేవలం నేను నమాజును ఏ విధంగా ఆచరినానో మీరు చూడాలని, ఆ విధంగా మీరు అనుసరించాలని, నమాజును ఏ విధంగా ఆచరించాలో మీరు నేర్చుకోవాలని మాత్రమే ఇలా చేసినాను” అన్నారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపయోగించిన మింబర్ (ప్రసంగవేదిక) దేనితో తయారు చేయబడింది అనే విషయంలో కొంతమంది తమలో తాము వాదులాడుకుని, సహాబాలలో ఒకరి దగ్గరికి వచ్చి "అది దేనితో తయారు చేయబడింది" అని ప్రశ్నించారు: అన్సారులలో ఒకరిని ఒక స్త్రీ వద్దకు ఆమెతో “మీ వద్ద ఉన్న వడ్రంగి సేవకునితో, నేను (మస్జిదులో) ప్రజలనుద్దేశించి ప్రసంగించవలసి వచ్చినపుడు, కూర్చోవడానికి ఒక వేదికను (మింబర్) ను తయారు చేయమని ఆదేశించండి” అని చెప్పమని పంపించినారు. ఆ స్త్రీ తన సేవకునికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఆ వేదికను తయారు చేయమని ఆదేశించినది. ఆ వేదిక “తామరిస్క్” వృక్షపు కలపతో తయారు చేయబడింది. అది తయారైన తరువాత ఆ స్త్రీ దానిని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పంపించింది. అపుడు ఆయన దానిని తీసుకుని మస్జిదులో అది ఇపుడు ఉన్న స్థానములో స్థాపింపజేసినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై నమాజును ఆచరించినారు. దానిపై ఉండగా “అల్లాహు అక్బర్” అని తక్బీర్ పలికి, రుకూ కూడా దానిపైనే ఆచరించి, తరువాత వెనుకకు అడుగులు వేస్తూ మెట్లు దిగి వేదిక ప్రక్కన రెండు సజ్దాలు చేసి తిరిగి మెట్లు ఎక్కి మింబర్ పైకి ఎక్కి – ఆ విధంగా నమాజును పూర్తి చేసినారు. తరువాత వారు ప్రజల వైపునకు తిరిగి “ఓ ప్రజలారా! మీరు నా నమాజు విధానాన్ని నేర్చుకుంటారని, ఆ విధంగా మీరు అనుసరిస్తారని మాత్రమే నేను ఇలా చేసినాను” అన్నారు.

فوائد الحديث

ఈ హదీసులో “ఖతీబ్” (ప్రసంగీకుడు – ఇమాం) ప్రజలనుద్దేశించి ప్రసంగించుట కొరకు ఎత్తైన వేదికను ఏర్పటు చేసుకోవచ్చును అని తెలుస్తున్నది. దాని వలన ప్రసంగము ప్రజలందరికీ చేరుతుంది, చక్కగా వినిపిస్తుంది.

అలాగే ఇందులో ప్రజలకు నేర్పించుట కొరకు ఎత్తైన వేదికపై నమాజు ఆచరించవచ్చును అని, అవసరం ఏర్పడితే ఇమాం నమాజు ఆచరణ కొరకు (ముఖ్తదీల కంటే) ఎత్తైన ప్రదేశాన్ని ఉపయోగించవచ్చు అని తెలుస్తున్నది.

ముస్లిముల అవసరాల కొరకు వివిధ రంగాలకు చెందిన నిపుణుల సహాయాన్ని తీసుకొన వచ్చును అని తెలుస్తున్నది.

నమాజు ఆచరిస్తున్నపుడు అవసరం కొద్దీ (నమాజులో ఉండగానే ముందుకు, వెనుకకు లేదా ప్రక్కలకు) రెండు, మూడు అడుగులు కదల వచ్చు అని తెలుస్తున్నది.

నమాజులో ఉండగా, ముఖ్తదీలు ఇమాంను చూడవచ్చు అని తెలుస్తున్నది. ఇమాంను చూసి నేర్చుకొనుటకు నమాజులో ఉండగా ఇమాంను చూడడం వలన అణుకువ, ఏకాగ్రత భంగం కావు.

التصنيفات

నమాజ్ పద్దతి