"మీరు ఏమంటారు? నేను తప్పనిసరి ఫర్ద్ నమాజులను చేస్తూ, రమజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ, ధర్మబద్ధమైన దానిని ధర్మబద్ధంగా…

"మీరు ఏమంటారు? నేను తప్పనిసరి ఫర్ద్ నమాజులను చేస్తూ, రమజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ, ధర్మబద్ధమైన దానిని ధర్మబద్ధంగా భావిస్తూ, మరియు నిషేధించబడిన దానిని నిషేధించబడినదిగా భావిస్తూ

అబూ అబ్దుల్లాహ్ జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ అల్ అన్సారీ రదియల్లాహు అన్హుమా ఉల్లేఖన: ఒక వ్యక్తి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగినాడు: "మీరు ఏమంటారు? నేను తప్పనిసరి ఫర్ద్ నమాజులను చేస్తూ, రమజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ, ధర్మబద్ధమైన దానిని ధర్మబద్ధంగా భావిస్తూ, మరియు నిషేధించబడిన దానిని నిషేధించబడినదిగా భావిస్తూ, నేను దానిపై ఏమీ అధికంగా చేయకుండా ఉంటే, నేను స్వర్గంలో ప్రవేశిస్తానా?" ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు: "అవును."

[ప్రామాణికమైన హదీథు] [ముస్లిం నమోదు చేసినారు:]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైనా కేవలం విధిగా ఆచరించవలసిన ఐదు పూటల నమాజులను మాత్రమే ఆచరిస్తాడో, వేరే స్వచ్ఛంద నమాజులు ఎక్కువగా ఆచరించడో, అలాగే విధిగా ఆచరించవలసిన రమదాన్ నెల ఉపవాసములను మాత్రమే ఆచరిస్తూ, ఇతర స్వచ్ఛంద ఉపవాసములను ఆచరించడో, హలాల్ విషయాలను హలాల్ విషయాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, వాటిని ఆచరిస్తూ, హరాం విషయాలను హరాం విషయాలని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ, వాటికి దూరంగా ఉంటాడో, అతడు స్వర్గము లోని ప్రవేశిస్తాడు.

فوائد الحديث

ఈ హదీసు ద్వారా – ఒక ముస్లిం తాను విధిగా ఆచరించవలసిన విద్యుక్త ధర్మాల పట్ల, బాధ్యతల పట్ల నిశితమైన ఆసక్తి కలిగి ఉంటాడని, నిషిధ్ధ విషయాలను వదిలివేస్తాడని, అలాగేఅతడి లక్ష్యము స్వర్గము లోనికి ప్రవేశించడమే అయి ఉంటుందని తెలుస్తున్నది.

ఇందులో (అల్లాహ్ చే) హలాల్’గా ప్రకటించబడిన విషయాలను ఆచరించడం, అవి నిశ్చయంగా హలాల్ విషయాలేనని మనస్ఫూర్తిగా విశ్వసించడం, హరాం విషయాలనుండి దూరంగా ఉండడం, అవి నిశ్చయంగా నిషిద్ధ విషయాలేనని మనస్ఫూర్తిగా విశ్వసించడంలోని ప్రాధాన్యత కనిపిస్తున్నది.

విధులను నిర్వర్తించడం, నిషిద్ధ విషయాలు వదిలి వేయడం అనేది స్వర్గములోనికి ప్రవేశించడానికి ఒక కారణం.

التصنيفات

అల్-ఇస్లాము., నమాజు, సియామ్/ఉపవాసవ్రతములు.