ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడు స్త్రీ వస్త్రాలు ధరించడాన్ని, స్త్రీ పురుషుని వస్త్రాలు ధరించడాన్ని…

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడు స్త్రీ వస్త్రాలు ధరించడాన్ని, స్త్రీ పురుషుని వస్త్రాలు ధరించడాన్ని శపించారు.

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పురుషుడు స్త్రీ వస్త్రాలు ధరించడాన్ని, స్త్రీ పురుషుని వస్త్రాలు ధరించడాన్ని శపించారు.

[దృఢమైనది]

الشرح

స్త్రీల వస్త్రాల వంటి శైలిని అనుకరించే పురుషులపై దైవ శాపం కలగాలని మరియు వారు ఆయన కరుణ నుండి దూరం కావాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థించారు. దుస్తుల ధరించడంలో, వాటి శైలిలో స్త్రీలు పురుషులను అనుకరించడం మరియు పురుషులు స్త్రీలను అనుకరించడం - ఒక పెద్ద పాపం

فوائد الحديث

ఇమామ్ షౌకానీ (రహిమహుల్లాహ్) యొక్క వివరణ: "స్త్రీలు పురుషులను, పురుషులు స్త్రీలను అనుకరించడం హరామ్ (నిషిద్ధం), ఎందుకంటే శాపం కేవలం నిషేధించబడిన పనులపైనే వస్తుంది."

ఇమామ్ ఇబ్నె ఉథైమీన్ (రహిమహుల్లాహ్) యొక్క వివరణ:

"ఏ దుస్తులైతే పురుషులు మరియు స్త్రీలు ఇద్దరూ ధరించే సాధారణ దుస్తులుగా గుర్తించబడినాయో, (ఉదా: కొన్ని రకాల షర్టులు, కాపులు), వాటిని ఇద్దరూ ధరించడంలో తప్పులేదు. ఎందుకంటే అవి ఇద్దరికీ కామన్ దుస్తులు."

التصنيفات

నిషేధించబడిన అనురూప్యము (పోలిక), వస్త్రాధరణ మరియు అలంకరణ