.

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఒక పురుష విశ్వాసి, ఒక స్త్రీ విశ్వాసి అసహ్యించుకొన రాదు. ఆమె లక్షణాలలో ఒకదానిని అతడు ఇష్టపడకపోతే, మరొక లక్షణంతో అతడు సంతోషిస్తాడు” లేక “వేరే (ఇంకేదైనా) లక్షణంతో” అన్నారు.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక భర్త తన భార్యను ద్వేషించరాదని, ఆమెను అసహ్యించుకొన రాదని నిషేధిస్తున్నారు. అలా చేయడం ఆమెపై హింసకు, ఆమెను వదిలివేయడానికి మరియు ఆమె నుండి ముఖం తిప్పేసుకోవడానికి దారి తీస్తుంది. మనిషి సహజంగా అసంపూర్ణుడు, ఒకవేళ అతను ఆమెలో ఒక చెడు లక్షణాన్ని ఇష్టపడకపోతే, అతను ఆమెలో మరొక మంచి లక్షణాన్ని కనుగొంటాడు; తన ప్రవృత్తికి సరిపోయే ఆ మంచి లక్షణంతో అతడు సంతృప్తి చెందుతాడు. తనకు నచ్చని ఆ చెడు లక్షణం పట్ల అతడు సహనం వహిస్తాడు. ఆ సహనం ఆమెను ద్వేషించడం నుండి, ఆమెను అసహ్యించుకోవడం నుండి ఆపుతుంది; ఆమెను వదిలి వేసేందుకు లేదా ఆమె నుండి దూరమయ్యేందుకు దారి తీసే పరిస్థితి రాకుండా చేస్తుంది.

فوائد الحديث

ఈ హదీసు విశ్వాసిని న్యాయంగా ప్రవర్తించమని పిలుపునిస్తున్నది. తన భార్యతో తలెత్తే ఏ వివాదంలోనైనా తాత్కాలిక భావోద్వేగాలకు లోను కాకుండా, హేతుబద్ధంగా వ్యవహరించమని బోధిస్తున్నది.

ఒక విశ్వాసి యొక్క విధి ఏమిటంటే అతడు ఒక విశ్వాస స్త్రీని, ఆమె నుండి విడిపోవడానికి దారి తీసేటంత ఎక్కువగా ద్వేషించరాదు, లేదా అసహ్యించుకొనరాదు. అలా కాకుండా ఆమెలో తనకు ఇష్టమైన లక్షణాల కొరకు తనకు ఇష్టం కాని లక్షణాలను ఉపేక్షించాలి.

ఈ హదీస్ భార్యాభర్తల మధ్య మంచి ప్రవర్తన మరియు సహవాసాన్ని ప్రోత్సహిస్తుంది.

విశ్వాసము మంచి నైతికత కలిగి ఉండమని పిలుపునిస్తుంది. ఏ విశ్వాస స్త్రీ అయినా లేదా విశ్వాస పురుషుడు అయినా మంచి నైతికత లేకుండా లేరు. అయితే విశ్వాసము వారిలో ప్రశంసనీయమైన లక్షణాల ఉనికిని కోరుతుంది.

التصنيفات

నికాహ్ (వివాహం), స్త్రీల ఆదేశాలు