“మీలో ఎవరైనా ధార్మిక (ఇస్లాం పరంగా) సోదరుడైన మరొక విశ్వాసిని కలిసినపుడు అతనికి ‘సలాం’ చేయాలి (అభివాదము చేయాలి).…

“మీలో ఎవరైనా ధార్మిక (ఇస్లాం పరంగా) సోదరుడైన మరొక విశ్వాసిని కలిసినపుడు అతనికి ‘సలాం’ చేయాలి (అభివాదము చేయాలి). ఒకవేళ వారి మధ్య ఒక చెట్టు, లేదా ఒక గోడ లేక ఒక పెద్ద శిల వచ్చినట్లైతే (దానిని దాటిన తరువాత) మరల అతణ్ణి కలిసినపుడు కూడా అతనికి సలాం చేయాలి (సలాం చేసి ఒకటి, రెండు నిమిషాలే అయినప్పటికీ)

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలికినారు, “మీలో ఎవరైనా ధార్మిక (ఇస్లాం పరంగా) సోదరుడైన మరొక విశ్వాసిని కలిసినపుడు అతనికి ‘సలాం’ చేయాలి (అభివాదము చేయాలి). ఒకవేళ వారి మధ్య ఒక చెట్టు, లేదా ఒక గోడ లేక ఒక పెద్ద శిల వచ్చినట్లైతే (దానిని దాటిన తరువాత) మరల అతణ్ణి కలిసినపుడు కూడా అతనికి సలాం చేయాలి (సలాం చేసి ఒకటి, రెండు నిమిషాలే అయినప్పటికీ).

[దృఢమైనది] [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ముస్లింలు తమ ముస్లిం సోదరులను కలుసుకున్నప్పుడల్లా ఒకరికొకరు అభివాదం చేయాలని (సలాం చేయాలని) ప్రోత్సహించడం చూడవచ్చు. వారు కలిసి నడుస్తున్నప్పుడు, వారి మధ్య చెట్టు, గోడ లేదా పెద్ద రాయి వంటి అడ్డంకి వచ్చి దానికి అటువైపునుండి ఒకరు, ఇటువైపునుండి ఒకరు నడుస్తూ, తరువాత వారు మళ్ళీ కలుసుకున్నప్పుడు, వారు మళ్ళీ ఒకరికొకరు సలాం చేయాలి – సలాం చేసి ఒకటి, రెండు నిమిశాలే అవుతున్నప్పటికీ.

فوائد الحديث

ఎటువంటి పరిస్థితిలోనైనా శాంతిని వ్యాపింపజేయడం అభిలషణీయము. పరిస్థితులలో మార్పులు వస్తూ ఉన్నా, ప్రతి మారుతున్న పరిస్థితిలోనూ శాంతిని వ్యాప్తి చేయడం అభిలషణీయము.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సమాజంలో ‘సలాంను’ (శాంతిని) ఒక విధానం లాగా, దానిని వీలైనంత అత్యధికంగా వ్యాప్తి చేయుటలో బాగా ఆసక్తి చూపేవారు. ఎందుకంటే ‘సలాం’ (శాంతి) ముస్లింలలో ప్రేమ మరియు సామరస్యాన్ని పెంచుతుంది.

‘సలాం’ చేయుట అంటే: ‘అస్సలాము అలైకుం’ (మీపై శాంతి కురియుగాక) అని పలుకుట; లేదా ‘అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు’ (మీపై అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు కురియుగాక) అని పలుకుట; ఇది కరచాలనము చేయుట కాకుండా, ఎందుకంటే అది మొదటిసారి కలుసుకున్నపుడు జరిగే ప్రక్రియ.

‘సలాం’ చేయుట అనేది ఒక దుఆ (ప్రార్థన); ఈ దుఆను (ప్రార్థనను) ముస్లిములు ఒకరికొకరు చేస్తూ ఉండాలి, అది మాటిమాటికీ చేయవలసి వచ్చినప్పటికీ.

التصنيفات

సలాంచేసే మరియు అనుమతి కోరే పద్దతులు