“వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది…

“వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “వాహనం పై సవారీ అయి ఉన్న వాడు, పాదచారునికి సలాం చేయాలి; పాదచారుడు కూర్చుని ఉన్నవానికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలలో ‘సలాం’ ను విస్తరించే విధానానికి సంబంధించిన విధానాలను బోధిస్తున్నారు – అది “అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు” (అల్లాహ్ యొక్క శాంతి, కరుణ మరియు శుభాలు మీపై కురియుగాక). చిన్న వాళ్ళు (వయసులో) పెద్దవారికి సలాం చేయాలి; సవారీ అయి ఉన్న వ్యక్తి, కాలినడకన వెళుతున్న వానికి సలాం చేయాలి; కాలినడకన వెళుతున్న వ్యక్తి కూర్చుని ఉన్న వ్యక్తికి సలాం చేయాలి; కొద్దిమంది ఉన్న సమూహం, ఎక్కువమంది ఉన్న సమూహానికి సలాం చేయాలి.

فوائد الحديث

‘సలాం’ చేయడమనేది హదీథులో సూచించబడిన విధానములో చేయుట మంచిది. అయితే, ఉదాహరణకు కూర్చుని ఉన్న వ్యక్తి, సవారి అయి ఉన్న వ్యక్తికి సలాం చేసినా, లేక పైన పేర్కొన్న మిగతా సందర్భాలలో అలా జరిగినా అది సమ్మతమే; అయితే అలా చేయడం, హదీసులో పేర్కొనబడిన అత్యంత విలువైన మరియు ఉత్తమమైన విధానానికి వ్యతిరేకమని గమనించాలి.

హదీసులో పేర్కొన్న పద్ధతి ప్రకారం సలాంను వ్యాప్తి చేయడం (సమాజములో) ప్రేమ మరియు సామరస్యం నెలకొనడానికి కారణాలలో ఒకటి.

హదీసులో పేర్కొనబడిన వారిలో ఇద్దరూ సమాన స్థితికి చెందిన వారే అయితే (ఉదాహరణకు: కాలినడకన వెళుతున్న వ్యక్తి మరొక కాలినడకన వెళుతున్న వ్యక్తి సలాం చేయడం; లేదా సవారీ పై వెళుతున్న వ్యక్తి మరొక సవారీ పై వెళుతున్న వ్యక్తి సలాం చేయడం మొ.) వారిలో ముందుగా సలాం చేసే వ్యక్తి ఉత్తముడు.

ప్రజలకు అవసరమైన ప్రతి విషయాన్ని విశదీకరించడంలోనే షరియత్ యొక్క సంపూర్ణత ఉన్నది.

ఇందులో ‘సలాం’ చేయుటకు సంబంధించిన మర్యాద; అలాగే ఎవరి హక్కును వారికి చెందేలా చేయడం యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.

التصنيفات

సలాంచేసే మరియు అనుమతి కోరే పద్దతులు