“మీలో ప్రతి ఒక్కరు సంరక్షకుడు మరియు ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యత వహిస్తారు

“మీలో ప్రతి ఒక్కరు సంరక్షకుడు మరియు ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యత వహిస్తారు

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ప్రతి ఒక్కరు సంరక్షకుడు మరియు ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యత వహిస్తారు; ప్రజలపై పాలకునిగా ఉన్న వ్యక్తి సంరక్షకుడు, అతడు వారికి బాధ్యత వహిస్తాడు; మనిషి తన ఇంటిలో ఉన్న వారందరిపై సంరక్షకుడు మరియు అతడు వారికి బాధ్యత వహిస్తాడు; స్త్రీ తన భర్త ఇంటికి మరియు అతని పిల్లలకు సంరక్షకురాలు మరియు వారికి బాధ్యత వహిస్తుంది; దాసుడు తన యజమాని ఆస్తికి సంరక్షకుడు మరియు దానికి బాధ్యత వహిస్తాడు. మీలో ప్రతి ఒక్కరు సంరక్షకులు, మరియు మీలో ప్రతి ఒక్కరూ తన వ్యక్తుల పట్ల బాధ్యులు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేస్తున్నారు: సమాజంలో ప్రతి ముస్లింకు అతను శ్రద్ధ వహించాల్సిన మరియు విధిగా భరించాల్సిన బాధ్యత ఉంది. నాయకుడు లేదా పాలకుడు అల్లాహ్ తన బాధ్యతలో ఉంచిన వారిపై సంరక్షకుడు; వారి (ధార్మిక) చట్టాలను పరిరక్షించడం, వారికి ఎవరు అన్యాయం చేసినా వారి నుండి రక్షించడం, వారి శత్రువులతో పోరాడడం మరియు వారి హక్కులను వృధా చేయకపోవడం వంటి బాధ్యతలను కలిగి ఉంటాడు. ప్రతి వ్యక్తీ అతని కుటుంబంలోని వ్యక్తులందరి పట్లా బాధ్యత కలిగి ఉంటాడు; వారిని పోషించడం, వారి పట్ల దయతో వ్యవహరించడం, వారికి బోధించడం మరియు వారికి క్రమశిక్షణ ఇవ్వడం వంటి బాధ్యతలను కలిగి ఉంటాడు. ప్రతి స్త్రీ తన భర్త ఇంటిలో – అతని ఇంటిని చక్కగా నిర్వహించుకోవటం, ఉత్తమ రీతిలో అతని పిల్లల పెంపకం నిర్వహించడం వంటివి భార్యకు బాధ్యతగా ఉంటాయి. ఈ విషయంలో ఆమె జవాబుదారీగా ఉంటుంది. సేవకుడు (దాసుడు, బానిస), మరియు ఉద్యోగి తమ యజమానుల సంపదకు బాధ్యత వహిస్తారు, వారి ఆధీనంలో ఉన్న వాటిని భద్రపరచడం మరియు వారికి సేవ చేయడం మొదలైనవి వారి బాధ్యతగా ఉంటాయి. వారు దానికి జవాబుదారీగా ఉంటారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ తన ఆధీనంలో ఉంచబడిన వాటిపై సంరక్షకులుగా ఉంటారు మరియు ప్రతి ఒక్కరూ తన సంరక్షణలో ఉన్న వ్యక్తులకు బాధ్యత వహిస్తారు.

فوائد الحديث

ముస్లిం సమాజంలో బాధ్యతలు సర్వసాధారణం. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యానికి అనుగుణంగా తమ బాధ్యతలు నెరవేర్చాలి.

ఇందులో స్త్రీ బాధ్యత చాలా ఔన్నత్యం గలది ఎందుకంటే ఆమె తన భర్త ఇంటికి సంబంధించిన హక్కును, తన పిల్లల పట్ల తన కర్తవ్యాలను ఉత్తమంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఆమె పై ఉన్నది.

التصنيفات

ఇమామ్ యొక్క విధులు, భార్యభర్తల మధ్య పది విషయాలు, సంతాన పోషణ