ఎవరైతే ఇస్లాంలో సత్కార్యాలు చేస్తారో వారు జాహిలియ్యహ్ కాలములో చేసిన వాటిలో దేనికీ జవాబుదారులుగా పట్టుకోబడరు.…

ఎవరైతే ఇస్లాంలో సత్కార్యాలు చేస్తారో వారు జాహిలియ్యహ్ కాలములో చేసిన వాటిలో దేనికీ జవాబుదారులుగా పట్టుకోబడరు. మరియు ఎవరైతే ఇస్లాంలో చెడుకు (పాపపు పనులకు) పాల్బడుతారో వారు తమ పూర్వపు మరియు ప్రస్తుత జీవితపు పాపపు పనులకు జవాబు దారులుగా పట్టుకోబడతారు” అన్నారు

ఇబ్నె మస్ఊద్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ఇలా అడిగాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మేము అజ్ఞాన కాలములో (ఇస్లాం స్వీకరించుటకు పూర్వపు జీవితంలో) చేసిన పనులకు (తీర్పు దినము నాడు) జవాబుదారులుగా పట్టుకోబడతామా? ” దానికి ఆయన “ఎవరైతే ఇస్లాంలో సత్కార్యాలు చేస్తారో వారు జాహిలియ్యహ్ కాలములో చేసిన వాటిలో దేనికీ జవాబుదారులుగా పట్టుకోబడరు. మరియు ఎవరైతే ఇస్లాంలో చెడుకు (పాపపు పనులకు) పాల్బడుతారో వారు తమ పూర్వపు మరియు ప్రస్తుత జీవితపు పాపపు పనులకు జవాబు దారులుగా పట్టుకోబడతారు” అన్నారు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాంలో ప్రవేశించుట యొక్క ఘనతను గురించి తెలియజేస్తున్నారు. ఎవరైతే ఇస్లాం స్వీకరించి, ఒక మంచి ముస్లింగా మారుతాడో, మరియు తన ధర్మాన్ని నిష్కల్మశంగా, చిత్తశుధ్ధితో నిజాయితీగా అనుసరిస్తాడో, అతడు జాహిలియ్యహ్ కాలములో చేసిన పాపపు పనులకు జవాబుదారుడుగా నిలబెట్టబడడు. మరియు ఎవరైతే ఇస్లాంకు నష్టం కలిగించడానికి కపటుడిగా ఇస్లాంలో ప్రవేశిస్తాడో లేదా ఇస్లాంలో ప్రవేశించిన తరువాత ధర్మభ్రష్టునిగా మారుతాడో (ఇస్లాం ధర్మానికి వ్యతిరేకిగా మారుతాడో) అటువంటి వాడు అవిశ్వాసిగా చేసిన పనులకు మరియు ఇస్లాంలో ప్రవేశించి చేసిన చెడు పనులకు గాను విచారించబడతాడు మరియు శిక్షించబడతాడు.

فوائد الحديث

ఇందులో అజ్ఞాన కాలములో తమ వల్ల జరిగిన పొరపాట్ల పట్ల సహబాల యొక్క ఆందోళన మరియు భయం కనిపిస్తున్నది.

ఇస్లాంలో ప్రవేశించిన తరువాత దానిపై పటిష్ఠంగా నిలబడి ఉండాలనే హితబోధ ఉన్నది.

ఇస్లాం లో ప్రవేశించుట పూర్వపు చెడుపనులను పరిహరిస్తుందనే విషయం తెలుస్తున్నది.

కపట విశ్వాసి మరియు ధర్మభ్రష్ఠుడు – వీరిద్దరూ జాహిలియ్యహ్ కాలములో చేసిన పాపాలకు మరియు ఇస్లాంలో చేసిన పాపాలకు జవాబుదారులుగా నిలబెట్ట బడతారు.

التصنيفات

ఇస్లాం, విశ్వాసం పెరుగుదల మరియు దాని తరుగుదల