ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ మీ నుండి జాహిలియహ్ కాలపు (ఇస్లాంకు పూర్వం ఉన్న అఙ్ఞాన కాలపు) అహంకారాన్ని మరియు…

ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ మీ నుండి జాహిలియహ్ కాలపు (ఇస్లాంకు పూర్వం ఉన్న అఙ్ఞాన కాలపు) అహంకారాన్ని మరియు వారి పూర్వీకుల గురించి వారి ప్రగల్భాలను తొలగించాడు

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “మక్కా విజయ దినమున (ఫతహ్ మక్కా దినాన) రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ఉద్దేశించి ఇలా ప్రసంగించినారు: “ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్ మీ నుండి జాహిలియహ్ కాలపు (ఇస్లాంకు పూర్వం ఉన్న అఙ్ఞాన కాలపు) అహంకారాన్ని మరియు వారి పూర్వీకుల గురించి వారి ప్రగల్భాలను తొలగించాడు. కాబట్టి, ఇప్పుడు రెండు రకాల ప్రజలు ఉన్నారు: అల్లాహ్ దృష్టిలో నీతిమంతుడు, పవిత్రుడు మరియు గౌరవప్రదమైన వ్యక్తి మరియు అల్లాహ్ దృష్టిలో దుర్మార్గుడు, దయనీయమైన మరియు అల్పమైన వ్యక్తి. ప్రజలు ఆదము యొక్క సంతానము, మరియు అల్లాహ్ ఆదమును మట్టి నుండి సృష్టించాడు. అల్లాహ్ ఇలా అంటున్నాడు: {ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము మరియు మీరు ఒకరినొకరు గుర్తించు కోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్‌ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.} [సూరహ్ అల్ హుజురాత్ 49:13]

[దృఢమైనది]

الشرح

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా విజయదినమున ప్రజలను ఉద్దేశించి ఇలా ప్రసంగించారు: ఓ ప్రజలారా, నిశ్చయంగా అల్లాహ్ మీ నుండి అఙ్ఞానకాలపు అహంకారాన్ని మరియు గర్వాన్ని అలాగే తమ తాతలు, తండ్రుల పట్ల అతిశయాన్ని తొలగించాడు. నిశ్చయంగా ప్రజలు రెండు రకాలు: ఒక రకం: సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ను ఆరాధించే - నీతిమంతుడు, పవిత్రుడు, విధేయుడైన విశ్వాసి. అతని విషయానికొస్తే, అతనికి ప్రజలలో (గౌరవప్రదమైన) వంశం లేకపోయినా, లేక వంశీయులు లేకపోయినా ఇది అల్లాహ్’కు గౌరవప్రదమైనది. రెండవ రకం: అతను అనైతిక, నీచమైన అవిశ్వాసి, అల్లాహ్ ముందు అతడు చాలా అల్పమైన వాడు మరియు అవమానకరమైన వాడు. అతను గౌరవం, ప్రతిష్ట మరియు అధికారం కలిగి ఉన్నప్పటికీ, అవేమీ విలువైనవి కాదు. ప్రజలందరూ ఆదమ్ అలైహిస్సలాం యొక్క సంతానము, మరియు అల్లాహ్ ఆదము అలైహిస్సలాం ను మట్టి నుండి సృష్టించాడు. ధూళి నుండి వచ్చిన వ్యక్తి అహంకారంతో తనను తాను మెచ్చుకోవడం తగదు. దీనికి ఋజువు మనకు అల్లాహ్ యొక్క ఈ ఆయతులో కనిపిస్తుంది: {ఓ మానవులారా! నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు ఒక స్త్రీ నుండి పుట్టించాము మరియు మీరు ఒకరినొకరు గుర్తించు కోవటానికి మిమ్మల్ని జాతులుగా మరియు తెగలుగా చేశాము. నిశ్చయంగా, మీలో ఎక్కువ దైవభీతి గలవాడే, అల్లాహ్‌ దగ్గర ఎక్కువ గౌరవం గలవాడు. నిశ్చయంగా, అల్లాహ్‌ సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు.} [సూరహ్ అల్ హుజురాత్ 49:13]

فوائد الحديث

తన వంశాన్ని గురించి, వంశజులను గురించి గొప్పలు చెప్పుకోవడం నిషేధము.

التصنيفات

ఇస్లాం ప్రాముఖ్యత మరియు దాని మంచి పద్దతులు, ఇస్లాం ధర్మ సాధారణ విషయాలు, ఇస్లాంలో మానవుని హక్కులు, ఆయతుల తఫ్సీర్