“అబూబక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హుమా) లను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు:…

“అబూబక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హుమా) లను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వీరిద్దరూ స్వర్గములో పెద్దవారికందరికీ నాయకులు - మొదటి తరం నుండి మొదలుకుని చివరితరం వరకూ, అయితే అల్లాహ్ యొక్క ప్రవక్తలు మరియు సందేశహరులకు తప్ప.”

అనస్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “అబూబక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హుమా) లను గురించి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “వీరిద్దరూ స్వర్గములో పెద్దవారికందరికీ నాయకులు - మొదటి తరం నుండి మొదలుకుని చివరితరం వరకూ, అయితే అల్లాహ్ యొక్క ప్రవక్తలు మరియు సందేశహరులకు తప్ప.”

[దృఢమైనది] [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: అల్లాహ్ యొక్క ప్రవక్తలూ మరియు సందేశహరుల తరువాత అబూబక్ర్ అస్సిద్దీఖ్ మరియు ఉమర్ అల్ ఫారూఖ్ (రదియల్లాహు అన్హుమా) ఇద్దరూ ప్రజలు అందరిలోకెల్లా ఉత్తములు, అలాగే స్వర్గములోనికి ప్రవేశించే వారందరిలోకెల్లా కూడా ఉత్తములు.

فوائد الحديث

ప్రవక్తలూ, సందేశహరుల తరువాత ప్రజలలో అబూబక్ర్ మరియు ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉత్తములు.

వాస్తవానికి స్వర్గములో వయసులో పెద్దవారు (ముసలివారు) ఎవరూ ఉండరు. స్వర్గములో ప్రవేశించే వారందరి వయస్సు 33 సంవత్సరాలు ఉంటుంది. ఈ హదీథులో ‘పెద్దవారు’ అనే పదానికి భావం ఏమిటంటే ఈ ప్రపంచములో పెద్ద వయసులో (ముసలితనములో) చనిపోయినవారు అని లేదా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీథును ప్రవచించినపుడు పెద్దవయసులో ఉన్నవారు అని కూడా కావచ్చు.

التصنيفات

ప్రవక్త అనుచరుల స్థానాలు రజిఅల్లాహు అన్హుమ్, ప్రవక్త అనుచరుల రజిఅల్లాహు అన్హుమ్ ప్రాముఖ్యతలు