“ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం రెండు నలుపు మరియు తెలుపు కొమ్ములతో కూడిన, గొర్రెలను బలిగా అర్పించారు, వీటిని…

“ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం రెండు నలుపు మరియు తెలుపు కొమ్ములతో కూడిన, గొర్రెలను బలిగా అర్పించారు, వీటిని ఆయన తన స్వంత చేతులతో ఖుర్బానీ చేసినారు. అపుడు, ఆయన ఇలా అన్నారు: "బిస్మిల్లాహ్, అల్లాహ్ అక్బర్!” మరియు వాటి మెడ మీద తన పాదాన్ని ఉంచినారు.”

అనస్ ఇబ్న్ మాలిక్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం రెండు నలుపు మరియు తెలుపు కొమ్ములతో కూడిన, గొర్రెలను బలిగా అర్పించారు, వీటిని ఆయన తన స్వంత చేతులతో ఖుర్బానీ చేసినారు. అపుడు, ఆయన ఇలా అన్నారు: "బిస్మిల్లాహ్, అల్లాహ్ అక్బర్!” మరియు వాటి మెడ మీద తన పాదాన్ని ఉంచినారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో అనస్ (రదియల్లాహు అన్హు) ఇలా తెలియ జేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈద్ అల్-అద్’హా రోజున నలుపుతో కలిసిన తెల్లని కొమ్ములతో ఉన్న రెండు పోతు గొర్రెలను తన చేతితో జిబహ్ చేసినారు. ఆయన ‘బిస్మిల్లాహ్’ ‘అల్లాహు అక్బర్’ అని పలికి వాటి మెడపై తన పాదాన్ని ఉంచినారు.

فوائد الحديث

జంతువును బలి ఇచ్చుట (అల్ ఉధ్’హియహ్, ఖుర్బానీ చేయుట) అనేది షరియత్ అనుమతించిన విషయమే. ఈ విషయం పై ముస్లిములందరి ఏకాభిప్రాయం ఉన్నది.

ఆ ఖుర్బానీ పశువులు (ఉధ్’హియ్యహ్) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుర్బానీ ఇచ్చిన వాటి లాంటివే కావడం ఉత్తమం; కారణం, ఆ ఖుర్బానీ పశువుల అందమైన రూపం, బాగా కొవ్వు పట్టి ఆరోగ్యంగా ఉండడం, ఆ కారణంగా వాటి మాంసం రుచిగా ఉండడం.

ఇమాం అన్నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ఒక వ్యక్తి తన ‘ఉధ్’హియ్యహ్’ను (ఖుర్బానీ పశువును) తానే జిబహ్ చేయుట మంచిది; ఏదైనా కారణం ఉంటే తప్ప వేరే వ్యక్తిని తన ‘ఉధ్’హియ్యహ్’ ను జిబహ్ చేయమని కోరరాదు. అటువంటి సందర్భములో తన కళ్ళ ఎదురుగా జిబహ్ చేయునట్లుగా చూడాలి. తన ‘ఉధ్’హియ్యహ్’ను జిబహ్ చేయమని వేరే వ్యక్తిని నియమించినట్లైతే అది అంగీకారయోగ్యమే అందులో ఎటువంటి వివాదమూ లేదు.

ఇమాం ఇబ్న్ హజర్ అల్ అస్ఖలానీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: జిబహ్ చేయునపుడు ‘బిస్మిల్లాహ్’ తో పాటుగా ‘అల్లాహు అక్బర్’ అని పలుకుట ఉత్తమం. ‘ఉధ్’హియ్యహ్’ (ఖుర్బానీ పశువు) మెడకు కుడి వైపున ఒక పాదాన్ని ఉంచాలి, మరియు ఖుర్బానీ పశువును దాని ఎడమ భాగాన నేలపై పడుకోబెట్టాలి, ఈ విషయం పై అందరి ఏకాభిప్రాయం ఉన్నది. అపుడు జిబహ్ చేయు వ్యక్తి తన పాదాన్ని బలిపశువు మెడకు కుడి వైపున ఉంచుట, తన కుడి చేతితో కత్తిని తీసుకుని ఎడమ చేతితో దాని తలను పట్టుకుని జిబహ్ చేయుట సులభం అవుతుంది.

కొమ్ములు కలిగిన పశువును (ఉదా: కొమ్ములు కలిగిన గొర్రెపోతు, కొమ్ములు కలిగిన మేకపోతు వగైరా) ఖుర్బానీ ఇచ్చుట మంచిది. ఒకవేళ కొమ్ములు కలిగిన పశువు లభ్యం కాకపోతె, కొమ్ములు లేని పశువు అయినా అంగీకారయోగ్యమే.

التصنيفات

జుబాహ్ చేయటం., ఖుర్బానీలు