“ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక పోరాట యోధుడిని (ఆయుధాలు మొ. వాటితో) సన్నద్ధం చేస్తాడో, అతను నిజంగా ఆ పోరాటంలో…

“ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక పోరాట యోధుడిని (ఆయుధాలు మొ. వాటితో) సన్నద్ధం చేస్తాడో, అతను నిజంగా ఆ పోరాటంలో పాల్గొన్నట్లే; మరియు ఆ యోధుడి గైరుహాజరీలో, అతనిపై ఆధారపడిన వారిని ఎవరు సరిగ్గా చూసుకుంటారో అతడు కూడా నిజంగా పోరాటంలో పాల్గొన్నట్లే.”

జైద్ ఇబ్న్ ఖాలిద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే అల్లాహ్ మార్గంలో ఒక పోరాట యోధుడిని (ఆయుధాలు మొ. వాటితో) సన్నద్ధం చేస్తాడో, అతను నిజంగా ఆ పోరాటంలో పాల్గొన్నట్లే; మరియు ఆ యోధుడి గైరుహాజరీలో, అతనిపై ఆధారపడిన వారిని ఎవరు సరిగ్గా చూసుకుంటారో అతడు కూడా నిజంగా పోరాటంలో పాల్గొన్నట్లే.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: అల్లాహ్ మార్గంలో పోరాడే ఒక యోధుని కొరకు – ఎవరైతే ప్రయాణ సాధనాలు, ఆయుధాలు, వాహనం, ఆహారం, ఆహారపదార్థాలు, ఇంకా అతనికి అవసరమైన ఇతర వస్తువులతో సహా ఆ యోధుడిని సిద్ధపరుస్తాడో, అతడు కూడా యోధుడిగానే పరిగణించబడతాడు మరియు (తీర్పు దినమునాడు) అతడు ఒక యోధునికి లభించే పుణ్యఫలాన్ని పొందుతాడు. అలాగే ఎవరైతే యోధుని పరోక్షంలో అతని వ్యవహారాలను చక్కగా చూసుకుంటాడో మరియు అతను లేనప్పుడు అతని కుటుంబాన్ని చూసుకోవడంలో అతని స్థానంలో అతని ప్రతినిధిగా ఉంటాడో అతడు కూడా యోధునిగా పరిగణించబడతాడు.

فوائد الحديث

ఇందులో మంచిని చేయుటలో ముస్లిములు ఒకరినొకరు సహకరించుకోవాలనే హితబోధ ఉన్నది.

ఇబ్న్ హజర్ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “ఈ హదీథ్‌లో ముస్లింల ప్రయోజనాల కోసం ఎవరైనా ఏదైనా చేసినా లేదా వారి ముఖ్యమైన పనులలో ఏదైనా ఒకదానిని నిర్వహించినా అటువంటి వారికి మేలు చేయాలి అనే ఉద్బోధ ఉన్నది.”

సాధారణ నియమం ఏమిటంటే: అల్లాహ్‌కు విధేయత చూపే చర్యలలో ఒక వ్యక్తికి ఎవరైనా సహాయం చేస్తే, ఆ వ్యక్తికి కూడా ఆచరించిన వాని ప్రతిఫలంలో కొంచెం కూడా తగ్గింపు లేకుండా – ఆచరించిన వాని లాంటి ప్రతిఫలమే లభిస్తుంది.

التصنيفات

ధర్మపోరాట ఘనత