సమీప భవిశ్యత్తులో మీపై అమీరులు (పాలకులు) వస్తారు. మీరు వారిని (వారి మంచి పనుల కారణంగా) ఇష్టపడనూ వచ్చు, లేదా (వారి…

సమీప భవిశ్యత్తులో మీపై అమీరులు (పాలకులు) వస్తారు. మీరు వారిని (వారి మంచి పనుల కారణంగా) ఇష్టపడనూ వచ్చు, లేదా (వారి దురాచరణల కారణంగా) వారిని ఇష్టపడకపోనూ వచ్చు. ఎవరైతే పాలకుని దురాచరణలను, దుర్మార్గాలను (అవి పునరావృతం కాకుండా ఉండాలని) అతని దృష్టికి తీసుకు వెళతాడో, (తీర్పు దినమున) అతడు తనను తాను రక్షించుకున్నవాడు అవుతాడు. మరియు ఎవరైతే (పాలకుని దృష్టికి తీసుకు వెళ్ళేటంత శక్తి, ధైర్యము లేక) అతని దుర్మార్గాలను మనసులో అసహ్యించుకుంటాడో (తీర్పు దినమున) అతడు శాంతిని పొందుతాడు. అయితే ఎవరైతే పాలకుని దుర్మార్గాలను ఆమోదిస్తాడో, మరియు వాటిని తాను కూడా ఆచరిస్తాడో – తీర్పు దినము నాడు నాశనమై పోతాడు.”

ఉమ్ముల్ ము’మినీన్ ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: సమీప భవిశ్యత్తులో మీపై అమీరులు (పాలకులు) వస్తారు. మీరు వారిని (వారి మంచి పనుల కారణంగా) ఇష్టపడనూ వచ్చు, లేదా (వారి దురాచరణల కారణంగా) వారిని ఇష్టపడకపోనూ వచ్చు. ఎవరైతే పాలకుని దురాచరణలను, దుర్మార్గాలను (అవి పునరావృతం కాకుండా ఉండాలని) అతని దృష్టికి తీసుకు వెళతాడో, (తీర్పు దినమున) అతడు తనను తాను రక్షించుకున్నవాడు అవుతాడు. మరియు ఎవరైతే (పాలకుని దృష్టికి తీసుకు వెళ్ళేటంత శక్తి, ధైర్యము లేక) అతని దుర్మార్గాలను మనసులో అసహ్యించుకుంటాడో (తీర్పు దినమున) అతడు శాంతిని పొందుతాడు. అయితే ఎవరైతే పాలకుని దుర్మార్గాలను ఆమోదిస్తాడో, మరియు వాటిని తాను కూడా ఆచరిస్తాడో – తీర్పు దినము నాడు నాశనమై పోతాడు.” ఇది విని అక్కడ ఉన్న వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగారు “ఓ ప్రవక్తా! అటువంటి పాలకునికి వ్యతిరేకంగా మేము పోరాడకూడదా?” దానికి ఆయన “అతడు నమాజులను స్థాపిస్తూ ఉన్నంత వరకు అతనికి వ్యతిరేకంగా పోరాడ రాదు” అన్నారు.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపున్నారు: మనపై పాలకులు నియమించబడతారు. వారి కొన్ని ఆచరణలు షరియత్ కు అనుగుణంగా ఉన్నాయి కనుక మనము ఆమోదిస్తాము, అలాగే కొన్ని ఆచరణలు షరియత్ కు వ్యతిరేకంగా ఉంటే వాటిని మనము వ్యతిరేకిస్తాము. ఎవరైతే పాలకుని షరియత్ వ్యతిరేక ఆచరణలను, వ్యతిరేకించే శక్తి, ధైర్యము లేక వాటిని తన మనసులో అసహ్యించు కుంటాడో అతడు తనను తాను పాపములో పడుట నుండి మరియు కపటత్వమునుండి కాపాడుకున్న వాడు అవుతాడు. ఎవరైతే షరియత్ వ్యతిరేక ఆచరణలను బహిరంగంగా ఖండిస్తాడో, వాటిని తన నాలుక ద్వారా (ప్రసంగాల ద్వారా) లేక తన చేతి ద్వారా ఆపడానికి ప్రయత్నిస్తాడో, అతడు తనను తాను పాపములో పడుట నుండి మరియు ఆ ఆచరణలలో పాల్గొనుట నుండి రక్షించుకున్న వాడు అవుతాడు. కానీ ఎవరైతే షరియత్ వ్యతిరేక కార్యాలను ఆమోదిస్తాడో, వాటి పట్ల ఇష్టంగా ఉంటాడో అతడు (పాలకుడు) నాశనం అయినట్లుగానే ఇతడూ నాశనం అవుతాడు. అపుడు అక్కడ ఉన్న వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను అడిగారు – ఈ లక్షణాలున్న పాలకునికి వ్యతిరేకంగా మేము పోరాటం చేయకూడదా? దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయడం నుండి వారించి, ఇలా అన్నారు: ఎందుకంటే వారు మీలో సలాహ్ ను (నమాజులను) స్థాపిస్తారు కనుక.

فوائد الحديث

ఇది ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి దైవదౌత్యం యొక్క నిదర్శనాలలో ఒకటి. ఆయన భవిష్యత్తులో జరుగబోయే దానిని గురించి (అగోచర విషయాన్ని గురించి) చెప్పారు. ఇప్పుడు అది వాస్తవమై ఆయన ప్రవచించినట్లుగానే జరుగుతున్నది.

చెడును, కీడును అనుమతించడానికి, అందులో పాల్గొనడానికి (షరియత్ లో) అనుమతి లేదు. చెడు మరియు కీడులను ఖండించాలి.

పాలకులు షరియాకు విరుద్ధంగా ఏదైనా చేస్తే, ఆ విషయంలో వారికి విధేయత చూపడం అనుమతించబడలేదు.

ముస్లిం పాలకునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరాదు. ఎందుకంటే దాని కారణంగా అశాంతి, అవినీతి, లంచగొండితనం, అరాచకత్వం ప్రబలిపోతాయి, రక్తపాతం, ప్రజలకు రక్షణ లేకపోవడం సాధారణమైపోతాయి. దానికంటే పాలకుని చెడును సహించడం తేలికైనది.

సలాహ్ (నమాజు స్థాపించుట) అత్యంత గొప్ప విషయం. అదే అవిశ్వాసానికి మరియు విశ్వాసానికి మధ్య తేడా.

التصنيفات

ఇమామ్ పై బయటకు వెళ్ళటం