మీరు ఎక్కడ ఉన్నా అల్లాహ్‌ పట్ల భయభీతి (తఖ్వా) కలిగి ఉండండి మరియు ఏదైనా చెడు పని చేస్తే, వెంటనే ఒక మంచి పని చేయండి,…

మీరు ఎక్కడ ఉన్నా అల్లాహ్‌ పట్ల భయభీతి (తఖ్వా) కలిగి ఉండండి మరియు ఏదైనా చెడు పని చేస్తే, వెంటనే ఒక మంచి పని చేయండి, అది దానిని అంటే ఆ పాపాన్ని తుడిచివేస్తుంది, మరియు ప్రజలతో మంచి నడవడికతో (చక్కని ప్రవర్తనతో) వ్యవహరించండి."٨

అబూ దర్, జున్దుబ్ బిన్ జునాదా, అబూ అబ్దిర్రహ్మాన్ మరియు ముఆద్ బిన్ జబల్ రదియల్లాహు అన్హుమ్ ల ఉల్లేఖన, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికిననారు "మీరు ఎక్కడ ఉన్నా అల్లాహ్‌ పట్ల భయభీతి (తఖ్వా) కలిగి ఉండండి మరియు ఏదైనా చెడు పని చేస్తే, వెంటనే ఒక మంచి పని చేయండి, అది దానిని అంటే ఆ పాపాన్ని తుడిచివేస్తుంది, మరియు ప్రజలతో మంచి నడవడికతో (చక్కని ప్రవర్తనతో) వ్యవహరించండి."٨

[హసన్ హదీథు అని అత్తిర్మిదీ తెలిపినారు] [అత్తిర్మిదీ నమోదు చేసినారు:]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు విషయాల గురించి ఆజ్ఞాపిస్తున్నారు: మొదటిది: ఎల్లప్పుడూ అల్లాహ్‌ పట్ల భయభక్తులు (తఖ్వా) కలిగి ఉండటం. అది, ప్రతి ప్రదేశంలోనూ, ప్రతి కాలంలోనూ, ప్రతి పరిస్థితిలోనూ , గోప్యంగానూ మరియు బహిరంగంగానూ, ఆరోగ్యంగా ఉన్నప్పుడూను మరియు కష్టాలలో ఉన్నప్పుడూను, విధిగావించిన వాటిని ఆచరించటం మరియు నిషేధించబడిన వాటికి దూరంగా ఉండటం వలన సాధ్యమగును. రెండవది: నీవు ఏదైనా ఒక చెడు పని చేసినట్లయితే, వెంటనే దాని తర్వాత ఒక మంచి పని చేయి — అది నమాజు (సలాహ్), దానధర్మం, సత్కార్యం, బంధుత్వాలు కలపడం (అంటే సత్సంబంధాలు నెలకొల్పడం), పశ్చాత్తాపం లేదా ఇతరత్రా ఏదైనా మంచి పని కావచ్చు—నిశ్చయంగా అది ఆ చెడు పనిని తుడిచివేస్తుంది (అంటే ప్రక్షాళన చేస్తుంది). మూడవది: ప్రజలతో మంచి నడవడికతో వ్యవహరించు, అందులో వారి ముఖాలపై చిరునవ్వు చిందించడం, దయ, మృదుత్వం, మేలు చేయడం మరియు బాధను తొలగించడం వంటివి అందులో ఉన్నాయి.

فوائد الحديث

మహోన్నతుడైన అల్లాహ్ తన దాసులపై తన కరుణ, మన్నింపు మరియు తన క్షమాపణల ద్వారా అనుగ్రహించాడు.

ఈ హదీథులో మూడు హక్కులు పొందుపరచబడ్డాయి: అల్లాహ్ హక్కు ఆయన పట్ల భయభక్తులు చూపడం ద్వారా, వ్యక్తిగత హక్కు పాపాలు చేసిన తర్వాత మంచి పనులు చేయడం ద్వారా, మరియు ప్రజల హక్కు వారితో మంచి నైతికతతో వ్యవహరించడం ద్వారా.

చెడు పనుల తర్వాత మంచి పనులు చేయమని ప్రోత్సహించడం మరియు మంచి నడవడిక కలిగి ఉండటం అనేది తఖ్వా (దైవభీతి) లక్షణాలలో ఒకటి, అయితే ఇక్కడ దానిని విడిగా ప్రస్తావించడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ దానిని స్పష్టం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

التصنيفات

సద్గుణాలు