“దానిని (నెలవంకను) చూసిన తరువాత ఉపవాసాలు ప్రారంభించండి; మరియు (రమదాన్ మాసము చివర) దానిని చూసినపుడు ఉపవాసములు…

“దానిని (నెలవంకను) చూసిన తరువాత ఉపవాసాలు ప్రారంభించండి; మరియు (రమదాన్ మాసము చివర) దానిని చూసినపుడు ఉపవాసములు విరమించండి. మేఘావృతమై ఉండి, అది కనబడక పోతే, అపుడు దానిని గురించి అంచనా వేయండి (అంటే షఅబాన్ నెల ముఫ్ఫై దినములుగా పూర్తి చేయండి)

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా పలుకగా నేను విన్నాను: “దానిని (నెలవంకను) చూసిన తరువాత ఉపవాసాలు ప్రారంభించండి; మరియు (రమదాన్ మాసము చివర) దానిని చూసినపుడు ఉపవాసములు విరమించండి. మేఘావృతమై ఉండి, అది కనబడక పోతే, అపుడు దానిని గురించి అంచనా వేయండి (అంటే షఅబాన్ నెల ముఫ్ఫై దినములుగా పూర్తి చేయండి).

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) రమదాన్ నెల ఆరంభాన్ని గురించి మరియు దాని ముగింపు గురించిన చిహ్నాలను ఈ విధంగా వివరిస్తున్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: “రమదాన్ మాసపు నెలవంకను చూసినపుడు ఉపవాసాలు ప్రారంభించండి, ఒకవేళ మీకూ మరియు నెలవంకకు మధ్య మబ్బులు అడ్డువచ్చి, అవి నెలవంకను కమ్మివేసి మీరు దానిని చూడలేకపోయినట్లైతే, షఅబాన్ మాసపు గడువును ముఫ్ఫై దినములుగా లెక్కించండి; మరియు షవ్వాల్ మాసపు నెలవంకను చూసినపుడు ఉపవాసములు విరమించండి; ఒకవేళ మీకూ మరియు నెలవంకకు మధ్య మబ్బులు అడ్డువచ్చి, అవి నెలవంకను కమ్మివేసి మీరు దానిని చూడలేకపోయినట్లైతే, రమదాన్ మాసపు గడువును ముఫ్ఫై దినములుగా లెక్కించండి.”

فوائد الحديث

నెల ప్రారంభము నెలవంకను చూడడం ద్వారా నిరూపించ బడుతుంది, గణనలపై కాదు.

ఇబ్న్ అల్-ముంధీర్ రమదాన్ మాసం ప్రారంభాన్ని నెలవంకను చూడకుండా, కేవలం లెక్కల ద్వారా మాత్రమే నిర్ణయించినట్లయితే ఉపవాసం తప్పనిసరి (వాజిబ్) కాదు అనే పండితుల ఏకాభిప్రాయాన్ని నివేదించారు.

ఒకవేళ మబ్బులుగానీ లేక మరింకేదైనా గానీ అడ్డుపడం వల్ల మీరు రమదాన్ మాసపు నెలవంకను చూడలేక పోయినట్లైతే, షఅబాన్ మాసమును ముఫ్ఫై దినములుగా పూర్తి చేయుట వాజిబ్ (తప్పనిసరి) అవుతుంది.

చాంద్రమానము ప్రకారం ఒక చంద్రమాసము ఇరువై తొమ్మిది లేక ముఫ్ఫై దినములు మాత్రమే ఉంటుంది.

ఒకవేళ మబ్బులుగానీ లేక మరింకేదైనా గానీ అడ్డుపడం వల్ల మీరు నెలవంకను చూడలేక పోయినట్లైతే, రమదాన్ మాసమును ముగించుట కొరకు రమదాన్ మాసమును ముఫ్ఫై దినములుగా పూర్తి చేయుట వాజిబ్ (తప్పనిసరి) అవుతుంది.

ఒకవేళ ఎవరైనా రమదాన్ ఉపవాసములకు సంబంధించి ముస్లింల వ్యవహారాలను పరిశీలించడానికి బాధ్యులైన వ్యక్తులు ఎవరూ లేని ప్రదేశంలో ఉన్నట్లైతే, లేదా (ఏదైనా కారణం వల్ల) రమదాన్ ఉపవాసముల పట్ల తగినంత శ్రద్ధ వహించక పోతున్నట్లైతే, అతడు దాని గురించి జాగ్రత్తపడాలి. రమదాన్ నెలవంకను స్వయంగా చూసిన వ్యక్తి ద్వారా దానిని ధృవీకరించుకోవాలి, లేదా అతను విశ్వసించే వ్యక్తి ఎవరైనా ఉన్నట్లైతే అతడు రమదాన్ నెలవంకను చూసినట్లు ధృవీకరించినట్లైతే, అతడు తదనుగుణంగా ఉపవాసములు ప్రారంభించడం మరియు ఉపవాసములు విరమించడం చేయవచ్చు.

التصنيفات

నెలవంకను చూడటం