“సౌమ్యత కోల్పోయినవాడు మొత్తం మంచితనాన్ని, శుభాన్ని కోల్పోయాడు.”

“సౌమ్యత కోల్పోయినవాడు మొత్తం మంచితనాన్ని, శుభాన్ని కోల్పోయాడు.”

జరీర్ ఇబ్న్ అబ్దుల్లాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సౌమ్యత కోల్పోయినవాడు మొత్తం మంచితనాన్ని, శుభాన్ని కోల్పోయాడు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియ జేస్తున్నారు: "ఎవరైతే సున్నితత్వాన్ని కోల్పోతాడో, ధార్మిక జీవితంలోనూ, ఈ ప్రాపంచిక జీవితంలోనూ విజయం సాధించలేడు – అది తన స్వయం కొరకు చేసే పనుల్లో అయినా సరే, ఇతరులతో కలిసి చేసే పనుల్లోనైనా సరే, లేక ఇతరుల కొరకు చేసే పనుల్లోనైనాసరే. అలాంటి వ్యక్తికి ఎలాంటి మేలు లభించదు.

فوائد الحديث

ఈ హదీథులో సున్నితత్వం, సౌమ్యత యొక్క ఘనత మరియు దానిని కలిగి ఉండాలనే హితబోధ మరియు ప్రోత్సాహం, మరియు హింసను ఖండించడం ఉన్నాయి.

సౌమ్యత కలిగి ఉండడం అనేది రెండు లోకముల జీవితం (ఇహలోక జీవితం, పరలోక జీవితం) కొరకు ఉత్తమమైనది. మరియు అది ఆయా లోకముల విషయాలను విస్తృతం చేస్తుంది. దీనికి సరిగ్గా వ్యతిరేకం ఆవేశము, హింస.

వ్యక్తిత్వంలో సౌమ్యత అనేది మంచి స్వభావం, శాంతి మరియు భద్రతల నుండి వస్తుంది; అలాగే వ్యక్తిత్వములో హింస, దౌర్జన్యము మొదలైన లక్షణాలు కోపం మరియు మొరటుతనం నుండి వస్తాయి. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సౌమ్యతను ప్రశంసించారు మరియు వారు దానిలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు.

సుఫ్యాన్ అల్-థౌరీ (రహిమహుల్లాహ్) తన సహచరులతో ఇలా అన్నారు: “సౌమ్యత అంటే ఏమిటో మీకు తెలుసా? వస్తువులను మరియు విషయాలను వాటి యొక్క ఉచిత స్థానాల్లో ఉంచడం, కాఠిన్యాన్ని దాని ఉచితమైన స్థానంలో ఉంచడం, సౌమ్యతను దాని ఉచితమైన స్థానంలో ఉంచడం, ఖడ్గాన్ని దాని ఉచితమైన స్థానంలో ఉంచడం (ఉపయోగించడం), కొరడాను దాని ఉచితమైన స్థానంలో ఉంచడం (ఉపయోగించడం).”

التصنيفات

సద్గుణాలు