‘అల్ హయా’ (వినయము, నమ్రత) కలిగి ఉండుట విశ్వాసములో ఒక భాగము

‘అల్ హయా’ (వినయము, నమ్రత) కలిగి ఉండుట విశ్వాసములో ఒక భాగము

అబ్దుల్లాహ్ ఇబ్నె ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక వ్యక్తి తోటి సహోదరునితో ‘వినయం, నమ్రత కలిగి ఉండు’ అని అంటూ ఉండగా విన్నారు. అపుడు ఆయన ఇలా పలికారు “‘అల్ హయా’ (వినయము, నమ్రత) కలిగి ఉండుట విశ్వాసములో ఒక భాగము”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తి తన సోదరుణ్ణి మరీ ఎక్కువ సిగ్గు పడరాదని అతడిని మందలించగా విన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అల్-హయా’ కలిగి ఉండుట (స్వభావములో వినయము, నమ్రత కలిగి ఉండుట) విశ్వాసములోని భాగము అని, అది కేవలం మంచినే తోడుకుని వస్తుంది అని అతడికి వివరించినారు. ప్రవృత్తిలో వినయము, నమ్రత కలిగి ఉండుట అనేది వికారము కలిగించే పనులనుండి దూరంగా ఉంచుతుంది, అందమైన పనులు చేయుటకు దారి తీస్తుంది.

فوائد الحديث

మంచి చేయుట నుండి దూరంగా ఉంచే ప్రవృత్తి ‘అల్ హయా’ అనిపించుకోదు. అది మితిమీరిన సిగ్గు కావచ్చు, అసమర్థత, అసహాయత కావచ్చు లేక పిరికితనం కావచ్చు లేక త్వరగా తేల్చలేని ప్రవృత్తి కావచ్చు.

అల్లాహ్ కు సంబంధించి ‘అల్ హయా’ అంటే, ఆయన ఆదేశించిన వాటిని ఆచరించడం మరియు ఆయన నిషేధించిన వాటినుండి దూరంగా ఉండడం.

ప్రజలకు సంబంధించి ‘అల్ హయా’ అంటే వారిని గౌరవించడం, వారికి ఇవ్వవలసిన స్థానమును వారికి ఇవ్వడం, సాధారణంగా ప్రజలు వికారమైనవిగా భావించే వాటి నుండి దూరంగా ఉండడం.

التصنيفات

సద్గుణాలు