“అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ ఘలబతిద్దైని, వ గలబతిల్ అ’దువ్వి, వ షమామతిల్ అ’దాఇ”…

“అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ ఘలబతిద్దైని, వ గలబతిల్ అ’దువ్వి, వ షమామతిల్ అ’దాఇ” (ఓ అల్లాహ్! అప్పుల భారం నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, శత్రువు నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, మరియు శత్రువు యొక్క ఈర్ష్యాసూయల నుండి, నా దురదృష్టాల పట్ల ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను)

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ ఇబ్న్ అల్ ఆస్ (రదియల్లాహు అన్హుమా) ఉల్లేఖన: “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ పదాలతో దుఆ చేసేవారు: “అల్లాహుమ్మ ఇన్నీ అఊదుబిక మిన్ ఘలబతిద్దైని, వ గలబతిల్ అ’దువ్వి, వ షమామతిల్ అ’దాఇ” (ఓ అల్లాహ్! అప్పుల భారం నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, శత్రువు నన్ను అధిగమించకుండా నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను, మరియు శత్రువు యొక్క ఈర్ష్యాసూయల నుండి, నా దురదృష్టాల పట్ల ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను)

[దృఢమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ మరియు శరణు వేడుకున్నారు: మొదటిది: (అల్లాహుమ్మ ఇన్నీ అఊదు బిక మిన్ గలబతిద్దైని) ఓ అల్లాహ్ నేను రక్షణ మరియు ఆశ్రయం కోరుతున్నాను, కేవలం నీ నుంచి, మరింకెవ్వరి నుంచీ కాదు, అప్పుల ఆధిపత్యం నుంచి, అవి నన్ను లొంగదీసుకోవడం నుంచి, వాటి వలన కలిగే దుఃఖము మరియు బాధ నుంచి. మరియు వాటిని తిరిగి చెల్లించడంలో మరియు వాటిని పరిష్కరించడంలో నీ సహాయాన్ని అడుగుతున్నాను. రెండవది: (వ గలబతిల్ అదువ్వి): ) ఓ అల్లాహ్! నేను నీ రక్షణ మరియు శరణు వేడుకుంటున్నాను – శత్రువు నన్ను అధిగమించడం నుండి, ఆ భారము నుండి, అతడి అణచివేత నుండి. మరియు అతని వలన జరిగే హానిని తొలగించమని, మరియు అతనిపై విజయం ప్రసాదించమని నేను నిన్ను అడుగుతున్నాను. మూడవది: (వ షమామతిల్ అ’అదాయి) శత్రువుల ఈర్ష్యాసూయలనుండి మరియు ముస్లింలకు సంభవించిన దురదృష్టం మరియు విపత్తుల పట్ల వారు ఆనందించడం నుండి నేను నీ నుండి రక్షణ కోరుతున్నాను, నీ శరణు వేడుకుంటున్నాను.

فوائد الحديث

అల్లాహ్ విధేయత నుండి పరధ్యానం కలిగించే, మనసు మళ్ళించే చర్యల నుండి, అప్పులు మరియు ఇతరుల వంటి ఆందోళన కలిగించే ప్రతిదాని నుండి అల్లాహ్ యొక్క ఆశ్రయం పొందాలని, ఆయన శరణు వేడుకోవాలని హితబోధ ఉన్నది.

సాధారణంగా అప్పు తీసుకోవడం తప్పు గానీ లేక అప్పు తీసుకోవడం పట్ల అభ్యంతరం గానీ ఏమీ లేదు. అప్పు తీసుకోవడం ఎప్పుడు అభ్యంతరకరం అవుతుంది అంటే, దానిని తీర్చే స్థోమత గానీ, స్థాయి గానీ, తీర్చేందుకు తగిన వనరులు గానీ లేకపోయినా అప్పు చేయడం. అది అప్పు చేసిన వాడిని అధిగమించే అప్పు అవుతుంది.

ఒక వ్యక్తి తనను అవహేళనకు గురి చేసే మరియు తాను విమర్శించబడే విషయాలకు దూరంగా ఉండాలి.

ఇందులో విశ్వాసుల పట్ల అవిశ్వాసుల విరోధము, శత్రుత్వము మరియు విశ్వాసుల కష్టాలను, దురదృష్టాలను చూసి వారు సంతోషిస్తారు అనే ప్రస్తావన ఉన్నది.

శత్రువులు ఒక వ్యక్తి దురదృష్టం పట్ల తమ ఆనందాన్ని వ్యక్తం చేయడం అనేది, ఆ వ్యక్తిని దురదృష్టం కంటే ఎక్కువగా బాధపెడుతుంది.

التصنيفات

మాసూర్ దుఆలు