“ఈ ప్రపంచము ఒక సంతోషము మరియు ఆనందము మాత్రమే. వాటిలో ఉత్తమమైనది ధర్మపరాయణురాలైన భార్య”

“ఈ ప్రపంచము ఒక సంతోషము మరియు ఆనందము మాత్రమే. వాటిలో ఉత్తమమైనది ధర్మపరాయణురాలైన భార్య”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అమ్ర్ అల్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఈ ప్రపంచము ఒక సంతోషము మరియు ఆనందము మాత్రమే. వాటిలో ఉత్తమమైనది ధర్మపరాయణురాలైన భార్య”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీసులో ఇలా తెలియజేశారు: ఈ ప్రపంచము మరియు దానిలో ఉన్నదంతా ఒక (పరిమిత కాలపు) సంతోషము, ఆనందము మాత్రమే. తరువాత అది అంతమైపోతుంది. మరియు దాని ఉత్తమమైన ఆనందము ధార్మికురాలైన భార్య. అతడు ఆమెను చూస్తే అతనికి సంతోషం కలుగుతుంది, అతడు ఆమెను ఏదైనా ఆదేశిస్తే, ఆమె దానిని వెంటనే పూర్తి చేస్తుంది. ఒకవేళ అతడు ఇంటికి దూరంగా ఉంటే ఆమె అతడిని పరిరక్షిస్తుంది – (తన శీలాన్ని కాపాడుకుంటూ) తనను తాను రక్షించుకొనుట ద్వారా, మరియు అతడి సంపదను కాపాడుట ద్వారా.

فوائد الحديث

అల్లాహ్ తన దాసుల కొరకు ఈ ప్రపంచములో ధర్మబద్ధం చేసిన (హలాల్) విషయాల ద్వారా సంతోషాన్ని, ఆనందాన్ని పొందవచ్చును. దానికి అనుమతి ఉంది. అయితే ఏ విషయం లోనూ హద్దు మీరరాదు, అలాగే ఏ విషయంలోనూ అతిశయానికి, డాంబికానికి వెళ్ళరాదు.

అలాగే ఈ హదీథులో మంచిభార్యను ఎంచుకోవాలి అనే ప్రోత్సాహము ఉన్నది. ఎందుకంటే ఆ ఎంపిక తన ప్రభువు యొక్క ఆదేశాలను అనుసరించడానికి ఆ భర్తకు సహాయపడుతుంది.

ఈ ప్రపంచపు అత్యుత్తమ సంతోషము, ఆనందము అల్లాహ్ (యొక్క ఆదేశాల) ను అనుసరించుటలో లేక అందుకు సహకరించుటలో ఉన్నది.

التصنيفات

స్త్రీల ఆదేశాలు