(ఓ ప్రవక్తా !) అప్పుడప్పుడు మా హృదయలలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే, వాటి గురించి మేము (బహిరంగంగా)…

(ఓ ప్రవక్తా !) అప్పుడప్పుడు మా హృదయలలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే, వాటి గురించి మేము (బహిరంగంగా) మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేము”. దానికి ఆయన “నిజంగా మీకు అలా అనిపిస్తూ ఉంటుందా?” అని అడిగారు. దానికి వారు “అవును” అని సమాధానమిచ్చారు. అపుడు ఆయన “అది నిర్మలమైన విశ్వాసము (నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం)” అన్నారు

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులలో కొందరు ఆయన వద్దకు వచ్చి ఇలా అన్నారు: “(ఓ ప్రవక్తా !) అప్పుడప్పుడు మా హృదయలలో ఎటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అంటే, వాటి గురించి మేము (బహిరంగంగా) మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేము”. దానికి ఆయన “నిజంగా మీకు అలా అనిపిస్తూ ఉంటుందా?” అని అడిగారు. దానికి వారు “అవును” అని సమాధానమిచ్చారు. అపుడు ఆయన “అది నిర్మలమైన విశ్వాసము (నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం)” అన్నారు.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

సహాబాలలో కొంతమంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి తమ హృదయాలలో తాము ఎదుర్కునే కొన్ని గంభీరమైన విషయాలను (ఆలోచనలను) గురించి ప్రస్తావించారు. వాటిలోని అసహ్యత, మరియు ఆ విషయాలపట్ల అయిష్టత, జుగుప్స వాటిని గురించి బహిరంగంగా మాట్లాడడానికి కూడా ధైర్యం చేయలేనటువంటివి అన్నారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఆ విషయాల పట్ల మీలో ఇటువంటి విఙ్ఞత కలగడం నిజానికి నిర్మలమైన విశ్వాసానికి నిదర్శనం. 'మీ హృదయాలలో షైతాను పడవేసే ఇటువంటి ఆలోచనల పట్ల మీలో జుగుప్స కలగడం, వాటిని మీరు పైకి చెప్పడానికి కూడా ఇష్టపడకపోవడం, వాటిని ఘోరమైన విషయాలుగా మీరు గుర్తించడం – షైతాను మీ హృదయాలపై ఎటువంటి నియంత్రణ పొందలేదు' అనడానికి నిదర్శనం. అలా కాకుండా ఆ విషయాలలో పడిపోయేవారు షైతానుకు వ్యతిరేకంగా ఎటువంటి రక్షణలేని వారు అని అర్థం.

فوائد الحديث

ఇందులో నిర్మలమైన విశ్వాసం కలిగిన వారి విషయంలో షైతాను బలహీనుడు అని, అతడు కేవలం చెడువిషయాల ఆలోచనలను మాత్రమే రేకిత్తించగలడు అని (వాటిని ఆచరించమని బలవంత పెట్టలేడని) అర్థమవుతున్నది.

మనసులో రేగే పరిపరి విధాల చెడు ఆలోచనలను నిరాకరించకపోవడం, వాటిని ఆమోదించుకోవడం అనేది బలహీనమైన విశ్వాసానికి నిదర్శనం. పరిపరి విధాల చెడు ఆలోచనలు రేకెత్తించడం షైతాను యొక్క పని.

ఒక విశ్వాసిని షైతాను కలుగజేసే పరిపరి విధాల చెడు ఆలోచనలు ఏమీ చేయలేవు. అయితే అతడు అటువంటి ఆలోచనలు కలిగినపుడు షైతాను నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకోవాలి, ఆ ఆలోచనలలో దూరం వెళ్ళిపోకుండా తనను తాను అదుపు చేసుకోవాలి.

ఈ హదీసులో, తన ధర్మానికి సంబంధించి ఏవైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే ఒక ముస్లిం మౌనంగా ఉండరాదని, వాటి గురించి (జ్ఞానం గలవారిని) ప్రశ్నించి, తెలుసుకోవాలి అనే సందేశం ఉన్నది.

التصنيفات

అల్లాహ్ అజ్జ వ జల్ల పట్ల విశ్వాసం., విశ్వాసం పెరుగుదల మరియు దాని తరుగుదల