“ఋతుస్రావం నుండి (బహిష్ఠు స్థితి నుండి) గుసుల్ చేసి పరిశుద్ధత పొందిన తరువాత (కూడా) విడుదల అవుతూ ఉండే పసుపు రంగు…

“ఋతుస్రావం నుండి (బహిష్ఠు స్థితి నుండి) గుసుల్ చేసి పరిశుద్ధత పొందిన తరువాత (కూడా) విడుదల అవుతూ ఉండే పసుపు రంగు ద్రవాన్ని అపరిశుద్ధమైనదిగా (మలినంగా) లెక్క చేసే వారము కాదు.”

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి విధేయతా ప్రమాణం చేసిన సాహబియ్యహ్ ఉమ్మ్ అతియ్య రజియల్లాహు అన్హా ఇలా ఉల్లేఖిస్తున్నారు: “ఋతుస్రావం నుండి (బహిష్ఠు స్థితి నుండి) గుసుల్ చేసి పరిశుద్ధత పొందిన తరువాత (కూడా) విడుదల అవుతూ ఉండే పసుపు రంగు ద్రవాన్ని అపరిశుద్ధమైనదిగా (మలినంగా) లెక్క చేసే వారము కాదు.”

[దృఢమైనది]

الشرح

ఈ హదీసులో సహాబియ్యహ్ ఉమ్మ్ అతియ్య రజియల్లాహు అన్హా ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో, బహిష్ఠు స్థితి నుండి (గుసుల్ చేసి) పరిశుద్ధత పొందిన తరువాత కూడా స్త్రీ జననాంగము నుండి స్రవిస్తూ ఉండే, పసుపు రంగు లేదా నలుపు రంగు ద్రవాన్ని, బహిష్ఠుగా భాగంగా భావించే వారము కాదు. దాని కారణంగా మేము నమాజు ఆచరించుట లేదా ఉపవాసములు పాటించుట ఆపివేసే వారము కాదు. (దీనిని బట్టి బహిష్ఠు స్థితిలో స్త్రీ జననాంగము నుండి రక్తస్రావము ఆగిపోయిన వెంటనే గుసుల్ చేసి పరిశుద్ధత పొందాలని, ఆతరువాత కూడా ఒకవేళ పసుపు రంగులో కానీ లేక నలుపు రంగులో కానీ ద్రవ పదార్థము స్రవిస్తూ ఉన్నట్లయితే దానిని మలినంగా భావించరాదని, నమాజు, ఉపవాసము మొదలైనవి ఆపివేయరాదని తెలియుచున్నది).

فوائد الحديث

ఋతుస్రావం నుండి స్వచ్ఛత పొందిన తరువాత స్త్రీ యోని నుండి విడుదలయ్యే ద్రవం, రక్తం స్రవించిన జాడల కారణంగా గోధుమ లేదా పసుపు రంగులో కనిపిస్తే కూడా దానికి ఎటువంటి ప్రాముఖ్యత లేదు.

సాధారణ ఋతుస్రావం సమయంలో గోధుమరంగు మరియు పసుపురంగు ద్రవం స్రవించడం ఋతుస్రావంగా పరిగణించ బడుతుంది ఎందుకంటే ఇది సాధారణంగా ఋతుస్రావం సమయంలో స్రవించే రక్తమే కానీ ద్రవంతో కలిసి ఉంటుంది.

రుతుక్రమం నుండి స్వచ్ఛతను పొందిన తర్వాత గోధుమ రంగు మరియు పసుపు రంగు స్రావాల కారణంగా ఒక స్త్రీ నమాజు లేదా ఉపవాసం నుండి దూరంగా ఉండరాదు; బదులుగా, ఆమె గుసుల్ చేయాలి మరియు నమాజు ఆచరించాలి.

التصنيفات

ఋతుస్రావం మరియు పురిటి రక్తము మరియు రక్తం కారటం