అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నిశ్చయంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం)ఇలా పలికినారు: “ఒకవేళ మీలో ఎవరి పాత్ర నుండి అయినా కుక్క త్రాగితే, ఆ పాత్రను ఏడుసార్లు కడగండి.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఒకవేళ ఏదైనా పాత్రలో కుక్క నాలుక పెడితే (ఆ పాత్రను నాకినా, లేక ఆ పాత్ర నుండి తిన్నా) ఆ పాత్రను ఏడు సార్లు కడగాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించినారు. అందులో మొదటిసారి మట్టితో తోమాలని తరువాత ఆరుసార్లు నీటితో కడగాలని ఆదేశించినారు. తద్వారా ఆ పాత్ర దాని అశుద్ధత నుండి మరియు దాని హాని నుండి పూర్తిగా పరిశుభ్రమవుతుంది.

فوائد الحديث

కుక్క యొక్క లాలాజలం అత్యంత అపరిశుభ్రమైనది.

కుక్క ఏదైనా పాత్రలో మూతిని పెట్టి నాకితే అది ఆ పాత్రను, మరియు అందులో ఉన్న నీటిని (పదార్థాలను) అశుద్ధ మైనదిగా మారుస్తుంది.

మట్టితో శుద్ధి చేయడం మరియు దానిని ఏడుసార్లు పునరావృతం చేయడం అనేది కుక్క ఏదైనా పాత్రను నాకినందు వలన కలిగే అశుద్ధతను దూరం చేయడానికి మాత్రమే ప్రత్యేకమైనది; కుక్క మూత్రము పోసినా, లేక మల విసర్జన చేసినా లేక ఇంకే విధంగానైనా అపరిశుభ్రతను, అశుద్ధతను కలిగించినా దానిని శుభ్రం చేయడానికి ఇలా (ఏడు సార్లు) చేయవలసిన అవసరం లేదు.

కుక్క మూతి పెట్టిన పాత్రను మట్టితో ఎలా కడగాలి: ముందుగా ఆ పాత్రలో నీళ్ళు పోసి, ఆ నీటికి మట్టిని జతచేయాలి. ఆ రెండింటి మిశ్రమంతో, ఆ పాత్రను శుభ్రంగా తోమి కడగాలి.

ఈ హదీసు ద్వారా స్పష్టమవుతున్న విషయం ఏమిటంటే – ఈ నియమం అన్ని కుక్కలకు వర్తిస్తుంది. ‘వేటకు, కాపలాకు, మరియు పశువుల పర్యవేక్షణకు కుక్కలను పెంచుకోవచ్చును’ అని షరియత్ ప్రధాత అయిన అల్లాహ్ అనుమతించిన కుక్కలకు కూడా ఇది వర్తిస్తుంది.

సబ్బుగానీ, లేక పాత్రలను కడగడానికి ఉపయోగించే ద్రవము గానీ, లేక పాత్రలను తోమడానికి ఉపయోగించే కొబ్బరి పీచు మొదలైనవి మట్టికి ప్రత్యామ్నాయము కావు. కనుక మొదటిసారి మట్టితో తోమి కడగడం తప్పనిసరి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో మట్టిని ప్రత్యేకించి ప్రస్తావించినారు కనుక.

التصنيفات

మాలీన్యములను తొలగించటం, పాత్రలు