ఇంట్లోని ఒక మూలలో ఒదిగి ఉండే ఒక బాలిక కంటే ఎక్కువ వినయాన్ని, బిడియాన్ని, నిరాడంబరతను “ప్రవక్త సల్లల్లాహు అలైహి…

ఇంట్లోని ఒక మూలలో ఒదిగి ఉండే ఒక బాలిక కంటే ఎక్కువ వినయాన్ని, బిడియాన్ని, నిరాడంబరతను “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిగి ఉండేవారు. ఒకవేళ ఎపుడైనా ఆయన తనకు ఇష్టం లేనిది ఏదైనా చూస్తే, ఆయన ముఖాన్ని చూసి మేము అది వెంటనే గ్రహించేవారము.”

అబూ సఈద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : ఇంట్లోని ఒక మూలలో ఒదిగి ఉండే ఒక బాలిక కంటే ఎక్కువ వినయాన్ని, బిడియాన్ని, నిరాడంబరతను “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కలిగి ఉండేవారు. ఒకవేళ ఎపుడైనా ఆయన తనకు ఇష్టం లేనిది ఏదైనా చూస్తే, ఆయన ముఖాన్ని చూసి మేము అది వెంటనే గ్రహించేవారము.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

అబూ సఈద్ అల్ ఖుద్రీ రదియల్లాహు అన్హు ఇలా తెలియజేస్తున్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - ఇంకా వివాహం చేసుకోని మరియు పురుషులతో ఎప్పుడూ సన్నిహితంగా మెలగని, తన ఇంటి వారితోనే ఎక్కువగా ఉండే అమ్మాయి కంటే కూడా ఎక్కువ బిడియము, నిరాడంబరత, వినయము కలిగి ఉండేవారు. ఈ లక్షణాలు ఆయనలో ఎంత ఎక్కువగా ఉండేవి అంటే, ఆయన ఏదైనా విషయాన్ని ఇష్టపడకపోతే, వెంటనే ఆయన ముఖం మారిపోయేది, (కొంతసేపు) ఆయన మాట్లాడేవారు కాదు. ఆయన సహాబాలు ఆయన ముఖం మీద అయిష్టతను చూసి అర్థం చేసుకునేవారు.

فوائد الحديث

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు సంబంధించి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత నిరాడంబరంగా ఉండేవారో, ఎంత వినయంగా ఉండేవారో, మరియు ఎంతటి బిడియస్థులో తెలుస్తున్నది. ఇది ఒక అత్యుత్తమ లక్షణం.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ నిరాడంబరత అల్లాహ్ యొక్క నిదర్శనాలకు, ఆయన ధర్మానికి, ఆయన యొక్క పవిత్రకు ఎవరూ భంగం కలిగించనంత వరకు మాత్రమే. ఒకవేళ ఈ విషయాలకు భంగం వాటిల్లితే ఆయన కోపగ్రస్థులై పోయేవారు, తదనుగుణంగా సహాబాలకు నిషేధాఙ్ఞలు జారీ చేసేవారు.

ఈ హదీసులో - నిరాడంబరతను, నమ్రతను అలవర్చుకోవాలని ప్రజలకు ఉద్బోధ ఉన్నది. ఎందుకంటే అది మంచి చేయడానికి మరియు చెడును నివారించడానికి మనస్సును ప్రేరేపిస్తుంది.

التصنيفات

దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిడియము