“ప్రభువు (అల్లాహ్) తన దాసునికి అతి చేరువలో ఉండే సమయం ఏది అంటే అది రాత్రిలోని చివరి భాగము

“ప్రభువు (అల్లాహ్) తన దాసునికి అతి చేరువలో ఉండే సమయం ఏది అంటే అది రాత్రిలోని చివరి భాగము

అబూ ఉమామహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నాకు ఈ విషయాన్ని అమ్ర్ ఇబ్న్ అబసహ్ రదియల్లాహు అన్హు తెలియజేసారు; ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా విన్నారు: “ప్రభువు (అల్లాహ్) తన దాసునికి అతి చేరువలో ఉండే సమయం ఏది అంటే అది రాత్రిలోని చివరి భాగము. ఆ ఘడియలో (రాత్రి చివరి భాగములో) అల్లాహ్ ను స్మరించే వారిలో ఒకరు కాగలిగే సామర్థ్యము మీలో ఉంటే అలా చేయండి.”

[దృఢమైనది] [رواه أبو داود والترمذي والنسائي]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: " సర్వశక్తిమంతుడు అయిన అల్లాహ్ రాత్రి చివరి మూడవ భాగంలో, తన దాసునికి అత్యంత చేరువగా ఉంటాడు; కనుక ఓ విశ్వాసి! మీరు నిద్ర నుండి లేవడంలో విజయం సాధిస్తే, ఈ సమయంలో అల్లాహ్‌ను ఆరాధించే, ప్రార్థించే, ధ్యానించే మరియు అల్లాహ్ ఎదుట పశ్చాత్తాపపడే వారిలో మీరు కూడా చేరగలిగితే, అలా తప్పక చేయండి, ఎందుకంటే ఇది శ్రద్ధతో ఒడిసి పట్టుకోవలసిన అద్భుత అవకాశం.

فوائد الحديث

ఈ హదీథులో రాత్రి చివరి భాగములో అల్లాహ్’ను ఆరాధించమనే హితబోధ ఉన్నది.

ఇందులో ఘనత కలిగిన కొన్ని ప్రత్యేక సమయాలు ఉన్నాయని, ఆ సమయాలలో సలాహ్ (నమాజు) ఆచరించుట, అల్లాహ్’ను స్మరించుట, ఆయనను వేడుకొనుట చేయవలెనని తెలుస్తున్నది.

'మీర్క్' అనే ఆయన ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలలో వ్యత్యాసం ఉన్నది: దానిని అర్థం చేసుకోవాలి. ఈ హదీథులో “ప్రభువైన అల్లాహ్ తన దాసునికి అతి చేరువలో ఉంటాడు...” అనే మాటలకు; మరొక హదీథులో “సజ్దాహ్ స్థితిలో దాసుడు తన ప్రభువుకు అతి చేరువలో ఉంటాడు” అని అనే మాటలకు అర్థం ఏమిటంటే – రాత్రి చివరి మూడవ భాగములో అల్లాహ్ తన దాసునికి అతి చేరువలో ఉంటాడు అని, దాసుడు తన ప్రభువుకు అతి చేరువలో ఉండే స్థితి ఏమిటంటే అతడు సలాహ్ (నమాజు)లో సజ్దాహ్ చేస్తున్న స్థితి.

التصنيفات

దుఆ స్వీకరింపబడటానికి మరియు దాని నుండి ఆటంకములకు కారణాలు