“అల్లాహ్ యొక్క దాసుడు ఒకవేళ వ్యాధిగ్రస్తుడై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా, అతడు స్థానికంగా ఉన్నపుడు లేదా…

“అల్లాహ్ యొక్క దాసుడు ఒకవేళ వ్యాధిగ్రస్తుడై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా, అతడు స్థానికంగా ఉన్నపుడు లేదా ఆరోగ్యంగా ఉన్నపుడు చేసే మంచిపనులకు సమానంగా అతని కొరకు ప్రతిఫలం వ్రాయబడుతుంది”

అబీ మూసా అల్ అష్అరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “అల్లాహ్ యొక్క దాసుడు ఒకవేళ వ్యాధిగ్రస్తుడై ఉన్నా లేదా ప్రయాణంలో ఉన్నా, అతడు స్థానికంగా ఉన్నపుడు లేదా ఆరోగ్యంగా ఉన్నపుడు చేసే మంచిపనులకు సమానంగా అతని కొరకు ప్రతిఫలం వ్రాయబడుతుంది”.

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ఎంతగా అనుగ్రహించే వాడో, ఎంతటి కరుణా ప్రధాతనో తెలిపినారు. ఒక ముస్లిం, ఒకవేళ అతడు (చిన్నవైనా సరే) సత్కార్యాలు చేసే అలవాటు కలిగి ఉండి, ఒకవేళ జబ్బు పడి తాను అలవాటుగా చేసే మంచిపనులు చేయలేని స్థితికి గురైతే లేదా తాను ప్రయాణంలో ఉండి లేదా పనులలో పడి తీరిక లేకుండా పోతే లేదా మరింకే కారణంగానైనా తాను అలవాటుగా చేసే మంచి పనులు చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటునట్లయితే, (అల్లాహ్ తరఫు నుండి) అతడి కొరకు, అతడు ఆరోగ్యంగా ఉన్నపుడు మరియు ప్రయాణంలో కాకుండా స్థానికంగా (ఇంటి వద్దనే) ఉన్నపుడు అతడు చేసే మంచిపనులకు లభించే ప్రతిఫలానికి సమానంగా అతడి ఖాతాలో పూర్తి ప్రతిఫలం వ్రాయబడుతుంది.

فوائد الحديث

ఇందులో, తన దాసుల కొరకు అల్లాహ్ యొక్క కారుణ్యం ఎంత విస్తృతమైనదో తెలుస్తున్నది.

ఇందులో, అల్లాహ్ యొక్క ఆరాధనలకు మరియు విధేయతకు సంబంధించిన విషయాలలో (మంచిపనులు చేసే విషయంలో) మనం ఆరోగ్యంగా ఉన్న సమయాన్ని మరియు మన తీరిక, సావకాశ సమయాలను విస్తృతంగా వినియోగించుకోవాలనే హితబోధ ఉన్నది.

التصنيفات

ఇస్లాం ప్రాముఖ్యత మరియు దాని మంచి పద్దతులు