“మానవుల శరీరంలో ప్రతి కీలు కొరకు, సూర్యుడు ఉదయించే దినాలలోని ప్రతి దినమూ, ఒక దానము (చేయవలసి) ఉంది

“మానవుల శరీరంలో ప్రతి కీలు కొరకు, సూర్యుడు ఉదయించే దినాలలోని ప్రతి దినమూ, ఒక దానము (చేయవలసి) ఉంది

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు. “మానవుల శరీరంలో ప్రతి కీలు కొరకు, సూర్యుడు ఉదయించే దినాలలోని ప్రతి దినమూ, ఒక దానము (చేయవలసి) ఉంది. ఇద్దరు వ్యక్తుల మధ్య న్యాయం చేయడం ఒక దానం అవుతుంది; ఒక వ్యక్తికి అతని వాహనం విషయములో – అతడు దాని పైకి ఎక్కుటలో గానీ, లేక అతని ప్రయాణ సామాగ్రిని వాహనం పైకి చేరవేయుటలోగానీ సహాయపడుట ఒక దానం అవుతుంది; ఒక మంచి మాట దానం అవుతుంది; జమా’అత్ తో సలాహ్ (నమాజు) ఆచరించుటకు వేసే ప్రతి అడుగూ దానం అవుతుంది; మరియు మార్గం నుండి హానికరమైన వస్తువులను తొలగించడం అనేది ఒక దానం అవుతుంది.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, యుక్తవయస్సుకు చేరుకున్న ప్రతి ముస్లిం తన శ్రేయస్సు కొరకు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కు స్వచ్ఛందంగా కృతజ్ఞతలు తెలుపుతూ తన ఎముకలలోని కీళ్ల సంఖ్యకు బదులు ప్రతిరోజూ ఒక్కో కీలుకు ఒక దానం ఇవ్వాలని వివరించారు; ఎందుకంటే ఆయన తన ఎముకలను ముడుచుకునేలా మరియు విస్తరించగలిగేలా కీళ్ళుగా చేసాడు గనుక. మరియు ఈ దానము మంచి పనులు చేయడం వల్ల పూర్తి అవుతుంది; ఇది ధనాన్ని దానంగా ఇవ్వడంపై ఆధారపడి ఉండదు; మంచిపనులు అంటే ఉదాహరణకు: ఇద్దరు వ్యక్తుల మధ్య, లేక రెండు వర్గాల మధ్య న్యాయం చేయడం, వారి మధ్య సయోధ్య కుదర్చడం – అది దానం అవుతుంది. తన వాహనం పైకి ఎక్కలేని వ్యక్తిని, అతడి వాహనం పైకి చేర్చుట, లేక అతని ప్రయాణ సామాగ్రిని ఎత్తి వాహనంపై పెట్టుట వంటివి కూడా దానంగా పరిగణించబడతాయి. ఒక మంచి మాట, అల్లాహ్ యొక్క స్మరణలో ఒక స్మరణ వాక్యమును పలుకుట, దుఆ చేయుట, మరియు సలాం చేయుట – మొదలైనవన్నీ దానములే. అలాగే సలాహ్ (నమాజు) ఆచరించుట కొరకు నీవు వేసే ప్రతి అడుగు కూడా ఒక దానమే అవుతుంది. ఇంకా మార్గము నుండి ప్రమాదకరమైన మరియు హానికరమైన వస్తువులను తొలగించడం కూడా దానమే.

فوائد الحديث

మానవ ఎముకల నిర్మాణం మరియు వాటి సమగ్రత ప్రతి ఒక్కరిపై సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి, కాబట్టి ఆ ఆశీర్వాదానికి కృతజ్ఞతతో ఉండటానికి ప్రతి ఎముకకు దాని తరపు దానం చేయుట అవసరం.

ఆ ఆశీర్వాదాల కొనసాగింపు కోసం ప్రతిరోజు మనం కృతజ్ఞత చూపడాన్ని కొనసాగించాలనే ప్రోత్సాహం ఉన్నది.

అలాగే ఇందులో ప్రతిరోజూ స్వచ్ఛంద ఆరాధనలు (నవాఫిల్) మరియు దాతృత్వ చర్యలను కొనసాగించాలి అని ప్రోత్సహించడం కనిపిస్తుంది.

ఇందులో ఇద్దరు వ్యక్తుల మధ్య సయోధ్య కుదర్చడం అనే ఆచరణ యొక్క ఘనత తెలియుచున్నది.

అలాగే, ఈ హదీసులో మనిషి తన సహోదరునికి సహాయం చేయాలి అనే హితబోధ ఉన్నది. ఎందుకంటే అతనికి సహాయం చేయడం దానం గా పరిగణించబడుతుంది.

జమా’అత్ తో సలాహ్ (నమాజు) ఆచరించాలని, అందుకు మస్జిదులకు కాలినడకన వెళ్ళాలని, ఆ విధంగా మస్జిదులను నిండుగా ఉండేలా చేయాలని – ఈ హదీథులో హితబోధ ఉన్నది.

అలాగే ఈ హదీసులో ముస్లిములు నడిచే కాలిబాటల, రహదారుల నుండి ప్రమాదము కలిగించే మరియు హాని కలిగించే వస్తువులను తొలగించడం ద్వారా వాటిని గౌరవించాలనే ఆదేశం ఉన్నది.

التصنيفات

ఇస్లాం ప్రాముఖ్యత మరియు దాని మంచి పద్దతులు