“ఎవరైతే నక్షత్ర గమనాల ద్వారా (గ్రహాల గమనాల ద్వారా) భవిష్యత్తు గురించి చెప్పే విద్యను నేర్చుకుంటే, అతడు చేతబడి…

“ఎవరైతే నక్షత్ర గమనాల ద్వారా (గ్రహాల గమనాల ద్వారా) భవిష్యత్తు గురించి చెప్పే విద్యను నేర్చుకుంటే, అతడు చేతబడి (భూతవైద్యం, మంత్రతంత్రాల విద్య) లో ఒక భాగం (ఒక శాఖను) నేర్చుకున్నట్లే. అతడు ఎంత కాలం ఆ విద్యను గడించితే అంత ఎక్కువగా దానిని పొందినట్లే.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే నక్షత్ర గమనాల ద్వారా (గ్రహాల గమనాల ద్వారా) భవిష్యత్తు గురించి చెప్పే విద్యను నేర్చుకుంటే, అతడు చేతబడి (భూతవైద్యం, మంత్రతంత్రాల విద్య) లో ఒక భాగం (ఒక శాఖను) నేర్చుకున్నట్లే. అతడు ఎంత కాలం ఆ విద్యను గడించితే అంత ఎక్కువగా దానిని పొందినట్లే.”

[దృఢమైనది] [దాన్ని ఇబ్నె మాజ ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఎవరైతే నక్షత్రాల గమనాలను, గ్రహాల గమనాలను అధ్యయనం చేయడం ద్వారా, అవి (భూకక్ష్య లోనికి) ప్రవేశించడం లేదా (దూరంగా) వెళ్ళిపోవడం మొదలైన వాటి ద్వారా – భూమిపై జరిగే ఘటనలను, ఉదాహరణకు ఎవరి మృత్యువునకు లేక ఎవరి జన్మకు లేక ఎవరైనా వ్యాధిగ్రస్తులు కావడానికి, లేక అలాంటి విషయాలకు లేక భవిష్యత్తులో జరుగబోయే అలాంటి విషయాలకు ముడిపెట్టి వాటికి ఋజువులుగా చూపుతాడో – అతడు నిశ్చయంగా చేతబడి (మంత్రతంత్ర) విద్యలో ఒక భాగాన్ని నేర్చుకున్నట్లే. అతడు ఎంత ఎక్కువగా అందులో నిమగ్నమైపోతే అంత ఎక్కువగా ఆ విద్యను నేర్చుకున్నట్లే.

فوائد الحديث

జ్యోతిష్యము, గ్రహాల మరియు నక్షత్రాల గమనాల ఆధారంగా వాటి స్థానము మరియు స్థితుల ఆధారంగా భవిష్యత్తును చెప్పే విద్య – అది హరాం (నిషేధము). ఎందుకంటే అది అగోచర విషయాల ఙ్ఞానమును కలిగి ఉండుటను దావా చేస్తుంది.

జ్యోతిష్యము, గ్రహాల మరియు నక్షత్రాల గమనాల ఆధారంగా వాటి స్థానము మరియు స్థితుల ఆధారంగా భవిష్యత్తును చెప్పే విద్య హరాం (నిషేధము). ఎందుకంటే అది ‘తౌహీదు’ నకు (అల్లాహ్ ఒక్కడే సకల విషయాలకు అధిపతి అనే విషయానికి) వ్యతిరేకం. అయితే, ప్రయాణములో సరియైన దారిని కనుగొనుటకు, నమాజు ఆచరించుట కొరకు ఖిబ్లా ఎటువైపు ఉన్నది అనే విషయాన్ని అంచనా వేయుటకు, ఋతువుల ఆగమనాన్ని, మాసముల ఆగమనాన్ని అంచనా వేయుటకు నక్షత్రాలను గమనించుట సరియైనదే. అది వాటి గమనాలు మరియు స్థానాల ద్వారా భవిష్యత్తును చెప్పుట అనే విషయానికి సమానం కాదు.

ఎంత ఎక్కువగా జ్యోతిష్య శాస్త్రము నేర్చుకుంటే, అతడు చేతబడి విధ్యలో అంత ఎక్కువ భాగాలను నేర్చుకున్నట్లే.

అల్లాహ్ తన దివ్య గ్రంథములో నక్షత్రాలకు సంబంధించి మూడు విశేషాలను ప్రస్తావించినాడు - నక్షత్రాలను ఆకాశానికి అలంకరణగా, ప్రజలకు వారి ప్రయాణాలలో మార్గాన్ని చూపే సాధనాలుగా, మరియు షైతానులను తరిమికొట్టే సాధనాలుగా.

التصنيفات

నవాఖిజుల్ ఇస్లాం (ఇస్లాంను విరగగొట్టేవి)