“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక తీర్పును ప్రభావితం చేసేందుకు లంచం ఇచ్చే వానిని మరియు లంచం…

“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక తీర్పును ప్రభావితం చేసేందుకు లంచం ఇచ్చే వానిని మరియు లంచం పుచ్చుకునే వానిని – ఇద్దరినీ శపించినారు.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం – ఒక తీర్పును ప్రభావితం చేసేందుకు లంచం ఇచ్చే వానిని మరియు లంచం పుచ్చుకునే వానిని – ఇద్దరినీ శపించినారు.”

[దృఢమైనది]

الشرح

ఈ హదీసులో – లంచము ఇచ్చే వాడు, మరియు లంచము పుచ్చుకునే వాడు – ఇద్దరూ - సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడూ అయిన అల్లాహ్ యొక్క కరుణనుండి, దూరమగు గాక అని శపించినారు. ఇందులో న్యాయమూర్తులకు ఇచ్చే లంచము కూడా ఉన్నది. తనకు హక్కు లేని విషయములో తన పక్షమున తీర్పు ఇచ్చేలా చేయుటకు అతడు లంచము ఇస్తాడు.

فوائد الحديث

లంచము ఇచ్చుట, లంచము పుచ్చుకొనుట, లంచము విషయములో మధ్యవర్తిత్వము చేయుట, లేక సహాయము చేయుట మొదలైనవన్నీ కూడా నిషేధము. కారణం – అది అసత్యానికి సహకరించిన దానికి సమానము.

లంచము అనేది ఘోరమైన పాపములలో (కబాఇర్ లలో) ఒకటి. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లంచము ఇచ్చు వానిని, లంచము పుచ్చుకొను వానిని – ఇద్దరినీ శపించినారు.

న్యాయవ్యవస్థలో లంచము అనేది అతి పెద్ద నేరము, మరియు అత్యంత ఘోరమైన పాపము. కారణము, దానివల్ల అన్యాయము జరుగుతుంది, మరియు అల్లాహ్ అవతరింప జేసిన చట్టము ద్వారా కాక ఇతర విషయముల (అసత్యాల) ఆధారంగా తీర్పు ఉంటుంది.

التصنيفات

తీర్పునిచ్చేవారి పద్దతులు