إعدادات العرض
“మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిని అతడు చేతితో ఆపాలి, ఒకవేళ అలా చేయగెలిగే సమర్థత లేనట్లయితే, దానిని అతడు…
“మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిని అతడు చేతితో ఆపాలి, ఒకవేళ అలా చేయగెలిగే సమర్థత లేనట్లయితే, దానిని అతడు నోటితో ఆపాలి, ఒకవేళ అలా ఆపగలిగే సమర్థత కూడా లేనట్లైయితే దానిని అతడు తన మనసుతో ఆపని చేయాలి; అది విశ్వాసము యొక్క అత్యంత బలహీన స్థాయి
అబూ సయీద్ ఖుద్రి రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలుపుతుండగా నేను విన్నాను: “మీలో ఎవరైనా చెడును చూసినట్లయితే, దానిని అతడు చేతితో ఆపాలి, ఒకవేళ అలా చేయగెలిగే సమర్థత లేనట్లయితే, దానిని అతడు నోటితో ఆపాలి, ఒకవేళ అలా ఆపగలిగే సమర్థత కూడా లేనట్లైయితే దానిని అతడు తన మనసుతో ఆపని చేయాలి; అది విశ్వాసము యొక్క అత్యంత బలహీన స్థాయి.
الترجمة
العربية Kurdî English Kiswahili Español اردو Português বাংলা Bahasa Indonesia فارسی தமிழ் हिन्दी සිංහල Tiếng Việt മലയാളം Русский မြန်မာ ไทย پښتو অসমীয়া Shqip Svenska Čeština ગુજરાતી Yorùbá Nederlands ئۇيغۇرچە Türkçe Bosanski Hausa دری Ελληνικά Azərbaycan Български Fulfulde ಕನ್ನಡ Кыргызча Lietuvių or Română Kinyarwanda Српски тоҷикӣ O‘zbek नेपाली Moore Wolof Tagalog Soomaali Français Українська bm Deutsch ქართული Македонски Magyar 中文 rn ភាសាខ្មែរ አማርኛ Malagasy Oromooالشرح
ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ నిషేధించిన ప్రతి చెడును, ప్రతి ఒక్కరూ తన సమర్థతను బట్టి ఆపాలి అని ఆదేశిస్తున్నారు. ఒకవేళ అతడు ఏదైనా చెడును చూసినట్లయితే, అతడు దానిని చేతితో ఆపగలిగే సామర్థ్యం కలిగి ఉంటే (అంటే దానిని చేతితో అడ్డుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటే) అతడు తప్పనిసరిగా అలా చేయాలి. ఒకవేళ అతడు చేతితో ఆ చెడును ఆపలేకపోతే, అతడు ఆ పనిని తన నాలుకతో ఆపాలి. (నాలుకతో ఆపడం అంటే) ఆ చెడును చేస్తున్న వానికి అతడు చేస్తున్నది చెడు అని, తద్వారా అతడు కలుగజేస్తున్న కీడును గురించి అతడికి వివరించాలి, అతడికి మంచి వైపునకు మార్గ దర్శనం చేయాలి. ఒకవేళ అతనిలో అంత సమర్థత కూడా లేనట్లయితే, అపుడు కనీసం అతడు తన మనసులోనైనా ఆ జరుగుతున్న చెడును అసహ్యించుకుని, దానిని అడ్డుకోగలిగే సమర్థత గనక తనకు ఉండి ఉంటే దానిని తప్పనిసరిగా అడ్డుకుంటాను అని సంకల్పం చేసుకోవాలి. చెడును అడ్డుకుని, దానిని మార్చగలిగే సామర్థ్యపు స్థాయిలలో, మనసు యొక్క స్థాయి అత్యంత బలహీనమైన స్థాయి.فوائد الحديث
చెడును అడ్డుకుని దానిని మార్చే సామర్థ్యపు స్థాయిలకు సంబంధించి ఈ హదీసు ఒక ప్రకటన వంటిది.
ఇందులో చెడును అడ్డుకుని దానిని మార్చే సమర్థత, సామర్థ్యములకు సంబంధించి ఒక క్రమానుగతం కనిపిస్తుంది.
చెడును అడ్డుకొనుట అనేది ధర్మములో ఒక ఉత్తమమైన అధ్యాయము వంటిది. అది ఒక ముస్లిం నుండి ఎన్నటికీ దూరం కాదు. కనుక తన శక్తి, సామర్థ్యము, సమర్థతలను అనుసరించి తన ఎదుట జరిగే చెడును అడ్డుకొనుట ప్రతి ముస్లిం యొక్క విధి.
మంచి చేయమని ఆదేశించుట, చెడును నిరోధించు విశ్వాసపు ముఖ్య లక్షణాలు. మరియు విశ్వాసములో హెచ్చుతగ్గులు ఉంటాయి.
చెడును నిరోధించడానికి అవసరమైన ముఖ్య విషయం ఏమిటంటే: అది చెడు అనే ఙ్ఞానము కలిగి ఉండుట.
చెడును అడ్డుకుని దానిని మార్చే విషయానికి సంబంధించి ఒక ముఖ్య నియమం: అదేమిటంటే, ఒక చెడు దాని కంటే ఎక్కువ చెడుకు దారి తీయరాదు.
చెడును అడ్డుకొనుట, దానిని ఆపుట అనేది ఒక విధానం ప్రకారం, కొన్ని నియమాలను అనుసరించి జరగాలి. ప్రతి ముస్లిం వాటిని నేర్చుకోవాలి.
ఒక విషయాన్ని చెడుగా నిర్థారించి, దానిని నిరాకరించడానికి రాజకీయ విధానం, లోతైన అవగాహన మరియు ఙ్ఞానము అవసరం.
మనస్సులోనైనా చెడును నిరాకరించక పోవడం – అది విశ్వాసపు బలహీనతను సూచిస్తుంది.