అల్’హందులిల్లాహ్ (స్తోత్రములన్నీ అల్లాహ్ కొరకే) ఆయన, వాడి (షైతాను యొక్క) కుతంత్రాన్ని (మనిషిలో) ఆలోచనలు…

అల్’హందులిల్లాహ్ (స్తోత్రములన్నీ అల్లాహ్ కొరకే) ఆయన, వాడి (షైతాను యొక్క) కుతంత్రాన్ని (మనిషిలో) ఆలోచనలు రేకెత్తించడంగా (మాత్రమే) మార్చివేసాడు (పరిమితం చేసాడు)” అన్నారు

"అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాలో ఒక్కొక్కసారి ఎటువంటి ఘోరమైన ఆలోచనలు వస్తాయంటే – అని అతడు వాటి గురించి అన్యోపదేశంగా చెబుతూ – వాటిని నోటితో పలకడం కన్నా తాను బొగ్గుగా మారడాన్ని ఇష్టపడతాను” అన్నాడు. దానికి ఆయన “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, (అల్లాహ్ అందరికన్నా పెద్దవాడు, అల్లాహ్ అందరికన్నా పెద్దవాడు), అల్’హందులిల్లాహ్ (స్తోత్రములన్నీ అల్లాహ్ కొరకే) ఆయన, వాడి (షైతాను యొక్క) కుతంత్రాన్ని (మనిషిలో) ఆలోచనలు రేకెత్తించడంగా (మాత్రమే) మార్చివేసాడు (పరిమితం చేసాడు)” అన్నారు.

[దృఢమైనది] [దాన్ని అబూ దావుద్ ఉల్లేఖించారు]

الشرح

ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి: “ఓ ప్రవక్తా! మా మనసులలో (ఒక్కొక్కసారి) చాలా ఘోరమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని గురించి మాట్లాడడం కన్నా బూడిదగా మారిపోవడం మంచిది అనేంత ఘోరమైన ఆలోచనలు” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండుసార్లు ‘తక్బీర్’ (అల్లాహు అక్బర్) పలికి, షైతాను యొక్క కుతంత్రాన్ని కేవలం ‘వసవసా’ (మనిషి హృదయంలో పరిపరి విధాల చెడు ఆలోచనలు రేకెత్తించడం) వరకే పరిమితం చేసినందుకు అల్లాహ్’కు కృతఙ్ఞతలు తెలిపారు.

فوائد الحديث

ఈ హదీసు ద్వారా – విశ్వాసిని అవిశ్వాసిగా మార్చడానికి, అతడి హృదయం లో షైతాను పరిపరి విధాల చెడు ఆలోచనలు రేకెత్తిస్తూ అతని చుట్టే తిరుగుతూ ఉంటాడని తెలుస్తున్నది.

అలాగే ఈ హదీసులో బలమైన విశ్వాసము కలిగిన వారిపట్ల షైతాను ఎంత బలహీనుడో తెలుస్తున్నది. ఎందుకంటే అతడు వారి హృదయాలలో కేవలం ఆలోచనలను మాత్రమే వేయగలడు (వాటి ద్వారా వారిని తన మార్గములోనికి తెచ్చుకోలేడు).

అటువంటి చెడు ఆలోచనలు మనసులో కలిగినపుడు విశ్వాసి వాటిని నిరాకరించాలి, త్రోసివేయాలి, దూరం చేసుకోవాలి.

ఒక వాంఛనీయమైన విషయం జరిగినపుడు, లేదా ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగినపుడు ‘తక్బీర్’ (అల్లాహు అక్బర్ – అల్లాహ్ అందరి కంటే గొప్పవాడు) అని పలకడం షరియత్’లోని విషయమే అని తెలుస్తున్నది.

ఏదైనా విషయం లో ఏదైనా సందేహం ఉంటే, ఒక ముస్లిం (ఆ విషయానికి సంబంధించిన) విద్వాంసుడిని ప్రశ్నించడం షరియత్ ప్రకారం సరియైనదే అని తెలుస్తున్నది.

التصنيفات

అల్లాహ్ అజ్జ వ జల్ల పట్ల విశ్వాసం., జిన్నులు