జిన్నులు

జిన్నులు

1- “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మాలో ఒక్కొక్కసారి ఎటువంటి ఘోరమైన ఆలోచనలు వస్తాయంటే – అని అతడు వాటి గురించి అన్యోపదేశంగా చెబుతూ – వాటిని నోటితో పలకడం కన్నా తాను బొగ్గుగా మారడాన్ని ఇష్టపడతాను” అన్నాడు. దానికి ఆయన “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, (అల్లాహ్ అందరికన్నా పెద్దవాడు, అల్లాహ్ అందరికన్నా పెద్దవాడు), @అల్’హందులిల్లాహ్ (స్తోత్రములన్నీ అల్లాహ్ కొరకే) ఆయన, వాడి (షైతాను యొక్క) కుతంత్రాన్ని (మనిషిలో) ఆలోచనలు రేకెత్తించడంగా (మాత్రమే) మార్చివేసాడు (పరిమితం చేసాడు)” అన్నారు.