“తమ వెంట కుక్కను తీసుకు వెళుతున్న ప్రయాణీకుల సమూహాన్ని, మరియు (తమ జంతువుల మెడలో) గంట కలిగిన ఉన్న ప్రయాణీకుల…

“తమ వెంట కుక్కను తీసుకు వెళుతున్న ప్రయాణీకుల సమూహాన్ని, మరియు (తమ జంతువుల మెడలో) గంట కలిగిన ఉన్న ప్రయాణీకుల సమూహాన్ని దైవదూతలు అనుసరించరు.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “తమ వెంట కుక్కను తీసుకు వెళుతున్న ప్రయాణీకుల సమూహాన్ని, మరియు (తమ జంతువుల మెడలో) గంట కలిగిన ఉన్న ప్రయాణీకుల సమూహాన్ని దైవదూతలు అనుసరించరు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ప్రయాణంలో ఉన్న వారిని, ఒకవేళ వారి వెంట కుక్క గానీ ఉన్నట్లయితే, లేక వారి వెంట ఉన్న జంతువుల మెడలో, ఆ జంతువులు కదిలినపుడల్లా మ్రోగేలా గంట కట్టి ఉంటే, ఆ ప్రయాణీకులను దైవదూతలు అనుసరించరు.

فوائد الحديث

వేటకు లేదా జంతువుల కాపలాకు తప్ప కుక్కను స్వంతానికి కలిగి ఉండడం నిషేధము.

వెంట అనుసరించని దైవదూతలు ఎవరంటే వారు ‘కారుణ్యపు దైవదూతలు’, రక్షక దైవదూతలు. అల్లాహ్ యొక్క దాసులను వారు వస్తూ పోతూ ఉన్న సమయాలలో ఎప్పుడూ వదిలి వెళ్ళరు.

గంటను మోగించటం నిషేధించడం జరిగింది, ఎందుకంటే అది షైతాను వాద్యాలలో ఒకటి, మరియు యూదులు గంట వాడడాన్ని పోలినట్లుగా ఉంటుంది.

దైవదూతలను దూరంగా ఉంచే ప్రతి విషయం నుండి దూరంగా ఉండే విషయం లో ప్రతి ముస్లిం జాగ్రత్తగా ఉండాలి

التصنيفات

దైవదూతలు