అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్

అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్

సౌబాన్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “నమాజు ముగించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు క్షమాభిక్ష కోరుకునేవారు. తరువాత ఇలా పలికేవారు “అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్” (ఓ అల్లాహ్! నీవు సంపూర్ణ శాంతివి, శాంతి, ప్రశాంతత అన్నీ నీ నుంచే; శుభాలన్నీ నీ కొరకే, ప్రతి శుభమూ నీ నుంచే; మహోన్నత, పరమ పవిత్రత, ఠీవి, వైభవము, తేజస్సు గలవాడా; మరియు కీర్తి, గౌరవం, ఘనత గలవాడా). అల్-వలీద్ ఇలా అన్నారు: “నేను అల్-ఔజాయీ ని ‘అల్ ఇస్తిగ్’ఫార్’ అంటే ఎలా అడగాలి?” అని ప్రశ్నించాను. దానికి ఆయన “అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్” అని పలుకు” అన్నారు.” (అస్తగ్ఫిరుల్లాహ్: నేను అల్లాహ్ నుండి క్షమాభిక్ష కోరుతున్నాను)

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

నమాజు ముగించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు “అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్’ఫిరుల్లాహ్” అని పలికేవారు. తరువాత ఆయన ఈ పదాలతో తన ప్రభువును కీర్తించేవారు: “అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్”. ఎందుకంటే అల్లాహ్ – ఆయనే శాంతి, ఆయన తన గుణగణాలలో పరిపూర్ణుడు. ఎటువంటి లోపము కానీ, దోషము కానీ లేని వాడు; మిగతా ఏ విషయం నుండీ కాకుండా, ఈ ప్రపంచపు కీడు మరియు హాని నుండి, మరియు పరలోకపు కీడు మరియు హాని నుండి మీరు పరమ పవితృడు అయిన ఆయన రక్షణ కోరుతారు. పరమపవిత్రుడు అయిన ఆయన (అల్లాహ్) ఈ రెండు లోకాలలో నిశ్చయంగా ఎన్నో రెట్లు శుభాలను ఉంచాడు. ఆయనే సర్వోన్నతుడు, మరియు ఆయనే దయ, కరుణ, కృప గలవాడు.

فوائد الحديث

ప్రతి నమాజు పూర్తి అయిన తరువాత అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరడం అభిలషణీయం, దీనిని క్రమం తప్పకుండా చేయడం అలవర్చుకోవాలి.

మన లోపాలను, కొరతలను పూర్తి చేయుట కొరకు, అలాగే మన విధేయతలో ఒకవేళ ఏమైనా కొరత ఉన్నట్లయితే దాని కొరకు - ఆ విధంగా ప్రతి నమాజు తరువాత అల్లాహ్ యొక్క క్షమాభిక్ష కోరడం అభిలషణీయం.

التصنيفات

నమాజ్ దఆలు