“ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము జిహాద్ ను అత్యుత్తమ ఆచరణగా భావిస్తాము. మరి మేము జిహాద్ చేయవద్దా…

“ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము జిహాద్ ను అత్యుత్తమ ఆచరణగా భావిస్తాము. మరి మేము జిహాద్ చేయవద్దా (జిహాద్ లో పాల్గొనవద్దా?), దానికి ఆయన ఇలా అన్నారు “లేదు, మీ కొరకు (స్త్రీల కొరకు) అత్యుత్తమమైన జిహాద్ ఏమిటంటే (అల్లాహ్ చే) స్వీకరించబడిన హజ్జ్”

విశ్వాసుల మాతృమూర్తి (ఉమ్ముల్ ము’మినీన్) ఆయిషా రజియల్లాహు అన్హా ఉల్లేఖనం : “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో ఇలా అన్నాను: “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! మేము జిహాద్ ను అత్యుత్తమ ఆచరణగా భావిస్తాము. మరి మేము జిహాద్ చేయవద్దా (జిహాద్ లో పాల్గొనవద్దా?), దానికి ఆయన ఇలా అన్నారు “లేదు, మీ కొరకు (స్త్రీల కొరకు) అత్యుత్తమమైన జిహాద్ ఏమిటంటే (అల్లాహ్ చే) స్వీకరించబడిన హజ్జ్”.

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచరులు రజియల్లాహు అన్’హుమ్, అల్లాహ్ మార్గములో జిహాద్ చేయుటను, శతృవులతో పోరాడుటను ఆచరణలలో అత్యుత్తమమైన ఆచరణగా భావించేవారు. అందుకని ఆయిషా రజియల్లాహు అన్హా “మరి మేము జిహాద్ చేయవద్దా?” అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెను ఉత్తమమైన జిహాద్ వైపునకు మార్గదర్శకం చేశారు, అదే, ఖుర్’ఆన్ మరియు సున్నత్ ల యొక్క వెలుగులో పాప రహితము మరియు కాపట్య రహితము అయి, ఆమోద యోగ్యమైన హజ్జ్ (హజ్జ్ అల్ మబ్రూర్).

فوائد الحديث

పురుషుల కొరకు అత్యుత్తమమైన ఆచరణలలో జిహాద్ ఒకటి.

స్త్రీల కొరకు జిహాద్ కంటే ఉత్తమమైనది హజ్జ్, మరియు అది వారి కొరకు అత్యుత్తమమైన ఆచరణలలో ఒకటి.

ఆచరణలు వేరు వేరుగా ఉంటాయి మరియు ఆచరించే వ్యక్తిని బట్టి భిన్నంగా ఉంటాయి.

హజ్‌ను జిహాద్ అని పిలుస్తారు, ఎందుకంటే ఇది ఆత్మ యొక్క పోరాటం, అందులో ధనం ఖర్చు చేయవలసి ఉంటుంది, శరీరక శక్తిని ఖర్చు చేయవలసి ఉంటుంది. ఇది అల్లాహ్ మార్గములో చేయు జిహాద్ లాగా ఆర్థిక మరియు శారీరక ఆరాధన.

التصنيفات

హజ్ మరియు ఉమరాల ఘనత