“ఎవరైతే అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేయడానికి పోరాడుతాడో అతడు అల్లాహ్ యొక్క మార్గములో ఉన్నవాడు.”

“ఎవరైతే అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేయడానికి పోరాడుతాడో అతడు అల్లాహ్ యొక్క మార్గములో ఉన్నవాడు.”

అబూ మూసా అల్ అషఅరీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను “శౌర్యపరాక్రమాలతో పోరాడేవాడు, జాత్యభిమానము తో పోరాడేవాడు మరియు ప్రదర్శనాబుధ్ధితో పోరాడేవాడు – వీరిలో ఎవరు అల్లాహ్ మార్గములో ఉన్నవాడు?’ అని ప్రశ్నించడం జరిగింది. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేయడానికి పోరాడుతాడో అతడు అల్లాహ్ యొక్క మార్గములో ఉన్నవాడు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను యోధుల విభిన్న లక్ష్యాలకు సంబంధించి ప్రశ్నించడం జరిగింది – (ప్రజల ముందు) శౌర్యపరాక్రమాలు గలవానిగా పోరాడేవాడు, తన జాతి జనుల కొరకు ఉన్మాదిలాగా పోరాడే వాడు, మరియు ప్రజల దృష్ఠిలో అల్లాహ్ మార్గములో పోరాడేవానిగా గుర్తింపు పొందుటకు లేక అటువంటి ఇతర విషయాన్ని ఆశించి పోరాడే వాడు – వీరిలో ఎవరు అల్లాహ్ మార్గములో ఉన్నవాడు? అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – “అల్లాహ్ మార్గములో పోరాడే యోధుడు ఎవరంటే: ఎవరైతే అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేయుటకు పోరాడుతాడో అతడు” అని తెలియజేసారు.

فوائد الحديث

ఆచరణల శ్రేష్ఠత్వము లేక అధమత్వములకు మూలము కేవలం అల్లాహ్ కొరకు మాత్రమే అనే సంకల్పము మరియు కల్మషము లేనితనమూను.

సంకల్పము అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేయుట అయిఉండి, దానికి అదనంగా షరియత్ కు అనుగుణమైన మరొక సంకల్పము కూడా జత కలిస్తే, అది ప్రథమంగా ఉన్న అసలు సంకల్పానికి హాని కలిగించదు. ఉదాహరణకు: అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నతం చేసే సంకల్పముతో పాటు యుద్ధఫలాలను పొందుట అనే సంకల్పము కూడా కలిగి ఉండుట.

మాతృభూమిని, పవిత్ర స్థలాలను శతృవులనుండి రక్షించుట కొరకు పోరాడుట అల్లాహ్ మార్గములో పోరాడుటగానే పరిగణించబడుతుంది.

ఇందులో ‘ముజాహిదీన్’ల గురించి ప్రస్తావించబడిన ఘనత, ఎవరైతే అల్లాహ్ యొక్క వాక్కును సర్వోన్నత స్థాయిలో ఉంచుటకు గానూ పోరాడుతారో వారికి మాత్రమే ప్రత్యేకమైనది.

التصنيفات

ధర్మపోరాట పద్దతులు