“మీ పంక్తులను (వంకర లేకుండా) సరిచేసుకొోండి, ఎందుకంటే నిశ్చయంగా (వంకర లేకుండా) పంక్తులను సరి చేసుకోవడం సలాహ్…

“మీ పంక్తులను (వంకర లేకుండా) సరిచేసుకొోండి, ఎందుకంటే నిశ్చయంగా (వంకర లేకుండా) పంక్తులను సరి చేసుకోవడం సలాహ్ యొక్క (నమాజు యొక్క) పరిపూర్ణతలో భాగము.”

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీ పంక్తులను (వంకర లేకుండా) సరిచేసుకొోండి, ఎందుకంటే నిశ్చయంగా (వంకర లేకుండా) పంక్తులను సరి చేసుకోవడం సలాహ్ యొక్క (నమాజు యొక్క) పరిపూర్ణతలో భాగము.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

సలాహ్ ఆచరించుటకు నిలబడిన వారిని తమ పంక్తులను (వంకర లేకుండా) సరి చేసుకోమని ఆదేశిస్తున్నారు. ఒకరికొకరు ఒక అడుగు ముందూ లేక వెనుకో నిలబడరాదని, పంక్తులను సరి చేసుకొనుట సలాహ్ యొక్క సంపూర్ణత మరియు పరిపూర్ణతలో భాగం అని, మరియు వరుసలు వంకరగా ఉండటం దానిలోని లోపం మరియు న్యూనత అని తెలియజేస్తున్నారు.

فوائد الحديث

సలాహ్ యొక్క పరిపూర్తి మరియు పరిపూర్ణతల కొరకు, మరియు దానిని లోపాల నుండి దూరంగా ఉంచుటకు తగిన అన్ని చర్యలు తీసుకొనుట షరియత్’లోని భాగమే.

ఇందులో విషయాన్ని బోధించుటలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వివేకాన్ని గమనించవచ్చు – ఆయన షరియత్ యొక్క ఙ్ఞానాన్ని విషద పరచడానికి, మరియు ప్రజలు దానిని అనుసరించడానికి - ఆ విషయానికి సంబంధించిన నియమాన్ని తగిన కారణంతో జత చేసి తెలియజేసినారు.

التصنيفات

ఇమామ్ మరియు ముఖ్తదీల ఆదేశాలు, మస్జిదుల ఆదేశాలు