“నమాజు ప్రారంభించునపుడు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను భుజాలవరకు పైకి ఎత్తేవారు

“నమాజు ప్రారంభించునపుడు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను భుజాలవరకు పైకి ఎత్తేవారు

అబ్దుల్లాహ్ ఇబ్న్ ఉమర్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “నమాజు ప్రారంభించునపుడు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను భుజాలవరకు పైకి ఎత్తేవారు; రుకూ కొరకు ‘అల్లాహు అక్బర్’ అని పలుకునపుడు మరియు రుకూ నుండి తల పైకి ఎత్తునపుడు అదే విధంగా పైకి ఎత్తేవారు. అపుడు “సమి’అల్లాహు లిమన్ హమిదహ్ రబ్బనా వలకల్ హంద్” అని పలికారు. అయితే సజ్దహ్’లో అలా చేసేవారు కాదు (చేతులను పైకి ఎత్తేవారు కాదు).”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజులో మూడు చోట్ల తన రెండు చేతులను, భుజాల వరకు లేదా భుజాలకు ముందు వాటికి సమాంతరంగా, పైకి ఎత్తేవారు. భుజము అంటే భుజపు టెముక మరియు దండ ఎముక రెండు కలిసే స్థలము. మొదటి చోటు: నమాజు ప్రారంభించుటకు ముందు “అల్లాహు అక్బర్” (తక్బీరతుల్ ఇహ్రాం) అని పలుకునపుడు. రెండవది: రుకూ కొరకు “అల్లాహు అక్బర్” అని పలుకునపుడు. మూడవది: రుకూ స్థితి నుండి తలపైకి ఎత్తుతూ “సమి’అల్లాహు లిమన్ హమిదహ్, రబ్బనా వలకల్ హంద్” అని పలికినపుడు. అయితే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దహ్ చేయుటకు ముందు కానీ, లేక సజ్దహ్ స్థితి నుండి తల పైకి ఎత్తునపుడు కానీ తన చేతులను పైకి ఎత్తలేదు.

فوائد الحديث

నమాజు రెండు చేతులను పై ఎత్తుట వెనుక ఉన్న వివేకవంతమైన, ఙ్ఞానవంతమైన విషయాలలో ఒకటి ఏమిటంటే – అది సలాహ్ యొక్క అలంకారము మరియు సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క మహిమను, పవిత్రతను, కొనియాడుట.

పైన తెలిపిన మూడు చోట్లలో మాత్రమే కాకుండా, మూడు రకాతుల లేక నాలుగు రకాతుల నమాజు లో నాలుగవ చోట కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను పై ఎత్తినట్లు, సునన్ అబూ దావూద్ మరియు ఇతర హదీసు గ్రంథాలలో నమోదు చేయబడిన అబూ హమీద్ అస్’సాయిదీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ద్వారా నిరూపితమై ఉన్నది – ఆ నాలుగవ చోటు ఏదంటే మొదటి తషహ్హుద్ (అత్తహయాతు లిల్లాహి) పఠించిన తరువాత మూడవ రకాతు కొరకు పైకి లేచునపుడు.

అలాగే సహీహ్ అల్ బుఖారీ మరియు సహీహ్ ముస్లిం హదీసు గ్రంథాలలో నమోదు చేయబడిన మాలిక్ బిన్ హువైరిస్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను చెవుల వరకు, వాటిని తాకకుండా, పైకి ఎత్తే వారని నిరూపితమై ఉన్నది – ఆయన ఇలా ఉల్లేఖించినారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహు అక్బర్” అని పలుకునపుడు తన రెండు చేతులను చెవుల వరకు (చెవులకు సమాంతరంగా) పైకి ఎత్తేవారు.”

నమాజు లో ‘తస్మీ’ను (“సమి’అల్లాహు లిమన్ హమిదహ్” ను) మరియు ‘తమ్హీద్’ను (రబ్బనా వలకల్ హంద్’ను) రెండింటినీ కలిపి ఉచ్ఛరించుట నమాజు ను నిర్వహిస్తున్న ఇమాంకు మరియు ఒంటరిగా నమాజు ఆచరిస్తున్న వానికి మాత్రమే ప్రత్యేకమైనది. ఇమాం వెనుక నమాజు ఆచరిస్తున్న వ్యక్తి ఇమాం ‘సమి’అల్లాహు లిమన్ హమిదహ్’ అని పలికినపుడు అతడు కేవలం ‘రబ్బనా వలకల్ హంద్’ అని మాత్రమే పలుకుతాడు.

“రబ్బనా వలకల్ హంద్” అని పలుకుట: రుకూ తరువాత (రబ్బనా వలకల్ హంద్ అని పలికే విషయం లో) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నాలుగు రకాల పదబంధాలు నిరూపితమై ఉన్నాయి. “రబ్బనా వలకల్ హంద్” అను పదబంధము వాటిలో ఒకటి. ఉత్తమం ఏమిటంటే ఒకసారి ఒక పదబంధాన్ని, మరొకసారి మరొక పదబంధాన్ని ఇలా ఒక్కోసారి ఒక్కో పదబంధాన్ని ఉచ్ఛరించుట. (1. రబ్బనా వలకల్ హంద్; 2. రబ్బనా లకల్ హంద్; 3. అల్లాహుమ్మ రబ్బనా వలకల్ హంద్; 4) అల్లాహుమ్మ రబ్బనా లకల్ హంద్)

التصنيفات

నమాజ్ పద్దతి