“మనిషి తన సన్నిహిత మిత్రుని ధర్మాన్ని (అంటే మార్గాలు, విధానాలు మరియు మర్యాదలు) అనుసరిస్తాడు. కాబట్టి, మీలో ప్రతి…

“మనిషి తన సన్నిహిత మిత్రుని ధర్మాన్ని (అంటే మార్గాలు, విధానాలు మరియు మర్యాదలు) అనుసరిస్తాడు. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరూ తన సన్నిహిత మిత్రునిగా ఎవరిని తీసుకోవాలో అనే విషయంలో జాగ్రత్త వహించాలి.”

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మనిషి తన సన్నిహిత మిత్రుని ధర్మాన్ని (అంటే మార్గాలు, విధానాలు మరియు మర్యాదలు) అనుసరిస్తాడు. కాబట్టి, మీలో ప్రతి ఒక్కరూ తన సన్నిహిత మిత్రునిగా ఎవరిని తీసుకోవాలో అనే విషయంలో జాగ్రత్త వహించాలి.”

[ప్రామాణికమైనది]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరిస్తున్నారు: ఒక వ్యక్తి తన ప్రవర్తన మరియు అలవాట్లలో తన సన్నిహిత స్నేహితుడిని మరియు సన్నిహిత సహచరుడిని పోలి ఉంటాడు. స్నేహం, నైతికతను, ప్రవర్తనను మరియు చర్యలను ప్రభావితం చేస్తుంది. అందుకని మంచి స్నేహితుడిని ఎంచుకోమని సలహా ఇస్తున్నారు; ఎందుకంటే మంచి మిత్రుడు తన స్నేహితుడిని విశ్వాసం వైపునకు, సన్మార్గం వైపునకు మంచి మరియు శుభం వైపునకు నడిపిస్తాడు.

فوائد الحديث

ఇందులో మంచి వ్యక్తులను స్నేహితులుగా కలిగి ఉండాలనే ఆదేశము, మరియు చెడు వ్యక్తుల సాంగత్యము పట్ల నిషేధము ఉన్నాయి.

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్నేహితుడిని గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు; మీ సోదరుని గురించో, లేక బంధువుని గురించో పేర్కొనలేదు. ఎందుకంటే, మీరు సహచరుడిని, స్నేహితుడిని ఎంచుకో గలరు, కానీ మీ సోదరుడు లేదా బంధువు విషయములో మీకు ఎంపిక చేసుకునే అవకాశం లేదు.

సన్నిహిత మిత్రుని ఎంచుకోవడం అనేది, జాగ్రత్తగా అన్ని విధాలా ఆలోచించిన మీదట తీసుకునే నిర్ణయం పైనే జరగాలి.

ఒక వ్యక్తి విశ్వాసులతో సహవాసం చేయడం ద్వారా తన ధర్మాన్ని బలపరుచుకుంటాడు, మరియు అనైతిక వ్యక్తులతో, దుష్టులు, దుర్మార్గులతో సహవాసం చేయడం ద్వారా దానిని బలహీన పరుచుకుంటాడు.

التصنيفات

స్నేహము,శతృత్వము యొక్క ఆదేశములు