“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు - తుమ్ము శబ్దాన్ని అణచివేయడానికి, లేదా తక్కువ…

“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు - తుమ్ము శబ్దాన్ని అణచివేయడానికి, లేదా తక్కువ చేయడానికి - తన చేతిని గానీ లేదా ఏదైనా వస్త్రాన్ని గానీ తన నోటికి అడ్డుగా పెట్టుకునేవారు.”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు - తుమ్ము శబ్దాన్ని అణచివేయడానికి, లేదా తక్కువ చేయడానికి - తన చేతిని గానీ లేదా ఏదైనా వస్త్రాన్ని గానీ తన నోటికి అడ్డుగా పెట్టుకునేవారు.”

[దృఢమైనది] [رواه أبو داود والترمذي وأحمد]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎపుడైనా తుమ్మినపుడు: మొదట: ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నోటికి చేతిని లేదా ఏదైనా వస్త్రాన్ని అడ్డుగా పెట్టుకునేవారు – తుమ్ము కారణంగా తన నోటి నుండి లేదా ముక్కు నుండి ఏమైనా బయటకు చింది అక్కడ కూర్చున్న వారికి ఇబ్బంది కలిగించకుండా. రెండు: ఆయన తన గొంతు నుండి ఎక్కువగా శబ్దం బయటకు రాకుండా (సాధ్యమైనంత) తక్కువ చేసేవారు.

فوائد الحديث

ఇందులో తుమ్ముటకు సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పద్దతి (ప్రవర్తనా విధానం), ఒక మార్గదర్శకముగా వివరించబడినది.

తుమ్మునపుడు నోటికి అడ్డుగా ఏదైనా వస్త్రాన్ని, ఉదాహరణకు: చేతి రుమాలు, లేక అటువంటి ఏదైనా వస్త్రాన్ని పెట్టుకోవాలని సిఫారసు చేయబడుతున్నది – నోటి నుండి లేదా ముక్కు నుండి ఇతరులకు హాని, లేదా ఇబ్బంది కలిగించే ఏ పదార్థమూ బయటకు రాకుండా.

తుమ్మినప్పుడు స్వరాన్ని తగ్గించుకోవడం తప్పనిసరి, మరియు ఇది మర్యాద యొక్క పరిపూర్ణత లోని మరియు నైతికత యొక్క గొప్పతనం లోని విషయము.

التصنيفات

తుమ్మే,మరియు ఆవులించే పద్దతులు, దైవప్రవక్త పుట్టుక గుణాలు