దైవప్రవక్త పుట్టుక గుణాలు

దైవప్రవక్త పుట్టుక గుణాలు

4- “ఓ విశ్వాసుల మాతృమూర్తీ! రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్థిరప్రకృతి, శీలసంపద, వ్యక్తిత్వము గురించి వివరించండి”. దానికి ఆమె “ఏం, నీవు ఖుర్’ఆన్ చదవలేదా?” అని ప్రశ్నించారు. నేను “చదివాను” అన్నాను. ఆమె “@ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వ్యక్తిత్వము, శీలసంపద పూర్తిగా ఖుర్’ఆనే” అన్నారు

7- “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది రకాతులు నాకు గుర్తున్నాయి*. జుహ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు, (జుహ్ర్ నమాజు) తరువాత రెండు రకాతులు, మగ్రిబ్ నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఇషా నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు ఆచరించుట నాకు గుర్తున్నాయి, మరియు ఆ సమయములో ఎవరూ ఆయన ఉన్న ఇంటిలో ప్రవేశించేవారు కారు.

9- “దజ్జాల్ ను గురించి అల్లాహ్ యొక్క ఏ ప్రవక్త కూడా తన జాతి జనులకు చెప్పని ఒక విషయాన్ని నేను మీకు చెప్పనా? అతడు ఒంటికన్ను వాడు; అతడు తన వెంట స్వర్గాన్నీ మరియు నరకాన్నీ పోలిన దానిని తీసుకుని వస్తాడు*. అయితే అతడు దేనినైతే స్వర్గం అని అంటాడో (వాస్తవానికి) అది నరకం. కనుక నూహ్ అలైహిస్సలాం తన జాతి జనులను ఏ విధంగానైతే హెచ్చరించినాడో నేనూ ఆ విధంగా మిమ్ములను హెచ్చరిస్తున్నాను.”

15- ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు నేను, ఇద్దరమూ జనాబత్ స్థితిలో ఉన్నపుడు, ఒకే నీటి తొట్టి నుండి నీళ్ళు తీసుకుంటూ ఇద్దరమూ కలిసి స్నానం చేసేవారము; *అలాగే నేను ఋతుస్రావము (బహిష్ఠు) స్థితిలో ఉన్నపుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను అంగవస్త్రము (షాల్ వంటిది) ధరించమని చెప్పి, నన్ను కౌగలించుకుని ముద్దులాడేవారు; అలాగే వారు మస్జిదులో ఏతికాఫ్ లో గడుపునపుడు – నేను బహిష్ఠు స్థితిలో ఉన్న సమయాన కూడా, వారు తన తలను (కిటికీ నుండి) ఇంటిలోనికి పెట్టేవారు , నేను వారి తలను కడిగేదానిని.