“ఎవరైతే సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తాడో, అతనికి – ఆ మార్గాన్ని అనుసరించిన వారి పుణ్యమును పోలినంత పుణ్యము…

“ఎవరైతే సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తాడో, అతనికి – ఆ మార్గాన్ని అనుసరించిన వారి పుణ్యమును పోలినంత పుణ్యము లభిస్తుంది; (ఆ మార్గమును అనుసరించిన) వారి పుణ్యములలో ఏ మాత్రమూ తక్కువ చేయబడదు

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే సన్మార్గం వైపునకు ఆహ్వానిస్తాడో, అతనికి – ఆ మార్గాన్ని అనుసరించిన వారి పుణ్యమును పోలినంత పుణ్యము లభిస్తుంది; (ఆ మార్గమును అనుసరించిన) వారి పుణ్యములలో ఏ మాత్రమూ తక్కువ చేయబడదు. మరియు ఎవరైతే మార్గభ్రష్టత్వము వైపునకు ఆహ్వానిస్తాడో, అతనికి - దానిని అనుసరించిన వారి పాపములను పోలినంత పాపము లభిస్తుంది; (ఆ మార్గమును అనుసరించిన) వారి పాపములలో ఏ మాత్రమూ తక్కువ చేయబడదు.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్ట పరిచినారు – ఎవరైతే ప్రజలకు సత్యమార్గము వైపునకు మరియు శుభము గల మార్గము వైపునకు, తన మాటల ద్వారా కానీ లేక తన ఆచరణల ద్వారా కానీ, మార్గదర్శకము చేసినా, లేక వారికి ఆ మార్గము వైపునకు దారి చూపినా, లేక ప్రోత్సహించినా, ప్రేరేపించినా – ఆ మార్గమును అనుసరించిన వారికి లభించిన పుణ్యాన్ని పోలినంత పుణ్యము అతనికి కూడా లభిస్తుంది – అయితే ఆ మార్గమును అనుసరించిన వారి పుణ్యములో కొద్దిగా కూడా తగ్గించబడదు. ఎవరైతే ప్రజలకు అసత్య మార్గము వైపునకు మరియు మార్గభ్రష్టత్వము వైపునకు, చెడు మరియు పాపము కలిగిన మార్గము వైపునకు లేదా షరియత్ అనుమతి లేని దాని వైపునకు (హరామ్ వైపునకు) తన మాటల ద్వారా కానీ లేక తన ఆచరణల ద్వారా కానీ, ప్రజలకు మార్గదర్శకము చేసినా, లేక వారికి ఆ మార్గము వైపునకు దారి చూపినా, లేక ప్రోత్సహించినా, ప్రేరేపించినా – ఆ భారము అతనిపై ఉంటుంది అలాగే ఆ మార్గమును అనుసరించిన వారికి లభించిన పాపాన్ని పోలినంత పాపము అతనికి లభిస్తుంది – అయితే ఆ మార్గమును అనుసరించిన వారి పాపములలో కొద్దిగా కూడా తగ్గించబడదు.

فوائد الحديث

ఈ హదీథులో సన్మార్గము వైపునకు ఆహ్వానించుట అనే ఆచరణ, అది చిన్నదైనా, లేక పెద్దదైనా, దాని యొక్క ఘనత తెలుస్తున్నది, మరియు ఆహ్వానించు వాని కొరకు – ఆ మార్గమును అనుసరించి ఆచరించిన వాని పుణ్యాన్ని పోలిన పుణ్యము ఉంది. అది (తన దాసులపై) అల్లాహ్ యొక్క అనంతమైన కృప, అనుగ్రహం మరియు పరిపూర్ణమైన కరుణ.

అలాగే ఇందులో మార్గభ్రష్టత్వము వైపునకు ఆహ్వానించుట ఎంత ప్రమాదకరమైన విషయమో తెలుస్తున్నది; అది చిన్నదైనా లేక పెద్దదైనా. ఆహ్వానించు వానిపై – ఆ మార్గమును అనుసరించి ఆచరించిన వాని భారమంతా ఉంటుంది.

ప్రతిఫలం ఎప్పుడూ ఆచరణను పోలి ఉంటుంది. ఎవరైతే మంచి వైపునకు, శుభం వైపునకు ఆహ్వానిస్తాడో – దానిని ఆచరించిన వాని ప్రతిఫలానికి సమానమైన ప్రతిఫలం అతనికి కూడా లభిస్తుంది; అలాగే ఎవరైతే చెడు వైపునకు, కీడు వైపునకు ఆహ్వానిస్తాడో – దానిని ఆచరించిన వాని పాపభారం వంటిదే అతనిపై కూడా పడుతుంది, దానికి (ఆ కీడు, లేక చెడుకు) సమానమైన ప్రతిఫలం దాని వైపునకు ఆహ్వానించిన వానికి లభిస్తుంది.

బహిరంగంగా గానీ చాటుగా గానీ పాపపు పనులకు పాల్బడడం నుంచి దూరంగా ఉండాలి. ఒక ముస్లిం ప్రజలు తనను గమనిస్తున్నారని, వారు తనను అనుకరించే ప్రమాదం ఉన్నదన్న విషయం గుర్తుంచుకోవాలి. తాను పాపపు పనులకు పాల్బడడం చూసి ఎవరైనా ఆ పనులకు పాల్బడితే, ఆ భారమంతా ఇతనిపై ఉంటుంది – వారిని ఆ పాపపు పనులకు పాల్బడేలా నేరుగా ప్రోత్సహించకపోయినా సరే.

التصنيفات

కొత్తపోకడ (బిద్అత్)