“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: …

“రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే, అతడు కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు (తహియ్యతుల్ మస్జిద్ నమాజు) ఆచరించాలి.”

అబీ ఖతాదా అస్’సలమీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే, అతడు కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు (తహియ్యతుల్ మస్జిద్ నమాజు) ఆచరించాలి.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బోధిస్తున్నారు – ఎవరైనా ఏ సమయములోనైనా, ఎందుకొరకైనా మస్జిదుకు వచ్చి అందులోనికి ప్రవేశించినట్లయితే, అతడు మస్జిదులో కూర్చునే ముందు రెండు రకాతుల నమాజు ఆచరించాలి - ఆ రెండు రకాతుల నమాజు ‘తహియ్యతుల్ మస్జిద్’ (మస్జిదునకు గౌరవ సూచకంగా చేయబడే నమాజు) అనబడుతుంది.

فوائد الحديث

‘తహియ్యతుల్ మస్జిదు’ గా మస్జిదులో కూర్చునే ముందు రెండు రకాతుల నమాజును ఆచరించుట అభిలషణీయము (ముస్తహబ్).

ఈ నమాజు, మస్జిదులోనికి (నమాజు కొరకైనా, లేక ఏ ఇతర పని కొరకైనా) ప్రవేశించి, మస్జిదులోపల కూర్చోదలచిన వారికి మాత్రమే వర్తిస్తుంది. అలాగాక మస్జిదులోనికి ప్రవేశించి, కొద్ది సేపటిలో కూర్చోకుండానే బయటకు వెళ్ళిపోయే వారికి వర్తించదు.

భక్తుడు మస్జిదులోనికి ప్రవేశించినపుడు, ప్రజలు మరియు ఇమాము సామూహిక నమాజు ప్రారంభించేసి ఉండినట్లయితే, అతడు తహియ్యతుల్ మస్జిదు నమాజు ఆచరించవలసిన అవసరం లేదు. (అతడు నేరుగా జమాతులోనికి ప్రవేశించాలి).

التصنيفات

నఫిల్ నమాజ్, మస్జిదుల ఆదేశాలు