“నా తరువాత అత్యంత స్వార్థపరత్వము, మరియు మీరు ఇష్టపడని ఎన్నో విషయాలను చూస్తారు.” అపుడు అక్కడ ఉన్నవారు “మరి…

“నా తరువాత అత్యంత స్వార్థపరత్వము, మరియు మీరు ఇష్టపడని ఎన్నో విషయాలను చూస్తారు.” అపుడు అక్కడ ఉన్నవారు “మరి (అటువంటి పరిస్థుతులలో) మా కొరకు మీ ఆదేశము ఏమిటి ఓ ప్రవక్తా ?” అని అడిగారు. దానికి ఆయన “మీ విధులను నిర్వర్తించండి, మీ హక్కుల కొరకు అల్లాహ్ ను ప్రార్థించండి” అన్నారు.”

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రజియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నా తరువాత అత్యంత స్వార్థపరత్వము, మరియు మీరు ఇష్టపడని ఎన్నో విషయాలను చూస్తారు.” అపుడు అక్కడ ఉన్నవారు “మరి (అటువంటి పరిస్థుతులలో) మా కొరకు మీ ఆదేశము ఏమిటి ఓ ప్రవక్తా ?” అని అడిగారు. దానికి ఆయన “మీ విధులను నిర్వర్తించండి, మీ హక్కుల కొరకు అల్లాహ్ ను ప్రార్థించండి” అన్నారు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ముస్లిములపై పాలకులుగా వచ్చే వారిని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు – వారిలో కొందరు ముస్లిముల ధనాన్ని, మిగతా వ్యవహారాలను తమ గుత్తాధిపత్యములో ఉంచుకుంటారు, తమ ఇష్టం వచ్చినట్లు (విలాసాలకు) ఖర్చు చేస్తారు, ఆ ధనముపై, సంపదపై ముస్లిములకు ఉన్న హక్కును నిరాకరిస్తారు. మరియు వారిలో కొందరు ధర్మములో అభ్యంతరకరమైన పనులకు పాల్బడే వారు కూడా ఉంటారు. సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా ప్రశ్నించారు “అటువంటి పరిస్థితులలో మమ్మల్ని ఏమి చేయమంటారు, మా కొరకు మీ ఆదేశాము ఏమిటి ఓ ప్రవక్తా?” అని. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు “వారు (ఆ పాలకులు) ధనముపై, సంపదపై గుత్తాధిపత్యము కలిగి ఉండుట, పాలకుల మాట వినుట, వారికి విధేయత చూపుట మొదలైన మీ విధులను మీరు నిర్వర్తించకుండా అడ్డుకొన రాదు. మీరు సహనం వహించాలి. వారి మాట వినాలి, వారితో విభేధించవద్దు. వారికి విధేయత చూపండి. మరియు మీ హక్కుల కొరకు అల్లాహ్’ను ప్రార్థించండి – తద్వారా వారి లోపాలను సరి చేయమని, వారిలోని దుష్టత్వాన్ని, దుర్మార్గాన్ని, అధర్మాన్ని, అన్యాయాన్ని దూరం చేయమని,

فوائد الحديث

ఈ హదీసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిం సమాజానికి (ఉమ్మత్’కు) చేసిన భవిష్యవాణి; వారు చెప్పినట్లుగానే ఈనాడు జరుగుతున్నది. ఇది వారి ప్రవక్తత్వానికి నిదర్శనము.

ఒక వ్యక్తికి కలుగబోయే నష్టాన్ని గురించిన ఙ్ఞానము (సమాచారము) మనకు ఉంటే దానిని అతనికి తెలియజేయాలనే అనుమతి ఇందులో ఉన్నది. తద్వారా అతడు దాని కొరకు ముందుగానే సన్నద్ధమై ఉంటాడు.

ఖుర్’ఆన్ మరియు సున్నత్’లను అంటిపెట్టుకుని ఉండుట – అటువంటి విభేదాల నుండి మరియు అటువంటి పరీక్షల నుండి బయట పడుటకు ఒక మార్గము.

ఇందులో – పాలకులు అన్యాయానికి పాల్బడే వారైనా, ఒక సహేతుకమైన పద్ధతిలో వారి మాట వినాలని, వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయరాదనే హితబోధ ఉన్నది.

ఎదురయ్యే అనేక రకాల పరీక్ష సమయాలలో సున్నత్’ను అంటిపెట్టుకుని ఉండి ఙ్ఞానవంతంగా మెలగాలి.

వ్యక్తి తన విధులను తప్పనిసరిగా నెరవేర్చాలి, అతనిపై ఏ విధమైన అన్యాయం వచ్చి పడినప్పటికీ.

ఈ హదీసులో (షరియత్ యొక్క) ఒక నియమం తెలుస్తున్నది: వ్యక్తి రెండు హానికరమైన వాటినుండి ఎన్నుకోవలసి వస్తే, తక్కువ హానికరమైన దానిని, మరియు రెండు నష్టపూరితమైన వాటి నుండి ఎన్నుకోవలసి వస్తే తక్కువ నష్టం కలిగించేదానిని ఎన్నుకోవాలి.

التصنيفات

ఇమామ్ యొక్క విధులు