“ఎవరైతే – ధర్మయుద్ధములో వీరునిగా మరణించే (షహీదుగా మరణించే) భాగ్యము ప్రసాదించమని – అల్లాహ్’ను హృదయపూర్వకంగా…

“ఎవరైతే – ధర్మయుద్ధములో వీరునిగా మరణించే (షహీదుగా మరణించే) భాగ్యము ప్రసాదించమని – అల్లాహ్’ను హృదయపూర్వకంగా వేడుకుంటాడో, అల్లాహ్ అతని స్థానాన్ని షహీదు స్థాయికి పెంచుతాడు; అతడు తన ఇంటిలో మంచము పై మరణించినా సరే.”

సహ్ల్ ఇబ్న్ హునైఫ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే – ధర్మయుద్ధములో వీరునిగా మరణించే (షహీదుగా మరణించే) భాగ్యము ప్రసాదించమని – అల్లాహ్’ను హృదయపూర్వకంగా వేడుకుంటాడో, అల్లాహ్ అతని స్థానాన్ని షహీదు స్థాయికి పెంచుతాడు; అతడు తన ఇంటిలో మంచము పై మరణించినా సరే.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: ఎవరైతే అల్లాహ్ మార్గంలో అమరత్వాన్ని మరియు ఆయన మార్గంలో షహీదు కావడాన్ని కోరుకుంటాడో, మరియు అతడు సర్వశక్తిమంతుడైన అల్లాహ్ కొరకు తన సంకల్పములో నిజాయితీగా మరియు విశ్వాసపాత్రంగా ఉంటే, అల్లాహ్ అతని సంకల్పశుద్ధి, నిజాయితీ కారణంగా అతనికి అమరవీరుల హోదాను ప్రసాదిస్తాడు - అతడు ధర్మయుధ్ధములో (జిహాదులో) కాకుండా తన ఇంటిలోని మంచముపై మరణించినా సరే.

فوائد الحديث

చిత్తశుద్ధితో కూడిన సంకల్పం కలిగి ఉండడంతో పాటు, సాధ్యమైనది చేయడం అనేది సంకల్పించిన ఆచరణ యొక్క ప్రతిఫలాన్ని పొందడానికి ఒక కారణం అవుతుంది; సంకల్పించిన ఆచరణ చేయలేకపోయినా సరే.

ఇందులో జిహాదులో పాల్గొనే సంకల్పము కలిగి ఉండడం, మరియు అల్లాహ్ మార్గములో వీరమరణం పొందే కోరిక కలిగి ఉండడం పట్ల ప్రోత్సాహము ఉన్నది.

ఇది సర్వశక్తిమంతుడైన అల్లాహ్ ఈ ఉమ్మత్’కు ప్రసాదించే గౌరవం. ఆచరణ చిన్నదైనా కూడా ఆయన స్వర్గంలో అతడికి అత్యున్నత స్థానాలను ప్రసాదిస్తాడు.

التصنيفات

హృదయాల ఆచరణలు, ధర్మపోరాట ఘనత