“ఓ అల్లాహ్! నా సమాధిని (పూజించబడే) ఒక విగ్రహం

“ఓ అల్లాహ్! నా సమాధిని (పూజించబడే) ఒక విగ్రహం

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “ఓ అల్లాహ్! నా సమాధిని (పూజించబడే) ఒక విగ్రహం మాదిరి కానివ్వకు. అల్లాహ్ వారిని శపించుగాక – ఎవరైతే తమ ప్రవక్తల సమాధులను సజ్దా (సాష్టాంగం) చేసే స్థలాలుగా చేసుకున్నారో!"

[దృఢమైనది] [దాన్ని ఆహ్మద్ ఉల్లేఖించారు]

الشرح

తన సమాధిని, ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజించే మరియు దానికి సజ్దాలు చేసే (సాష్టాంగాలు చేసే) ఒక విగ్రహం మాదిరిగా చేయకు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ప్రభువు అయిన అల్లాహ్ ను వేడుకున్నారు. ఇంకా ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘ఎవరైతే ప్రవక్తల సమాధులను సజ్దాలు చేసే (సాష్టాంగాలు చేసే) స్థలంగా చేసుకున్నారో, అల్లాహ్ వారిని తన కారుణ్యం నుండి తొలగించి వేస్తాడని తెలియ జేసినారు. ఎందుకంటే వాటిని ప్రార్థనా స్థలాలుగా చేసుకోవడం అనేది కాలక్రమంలో వాటిపై తమ విశ్వాసాన్ని పెంచు కోవడానికి మరియు వాటిని పూజించడానికి ఒక మార్గంగా మారగలదు.

فوائد الحديث

ప్రవక్తలు మరియు సత్పురుషుల సమాధుల విషయంలో షరియత్ అనుమతించిన హద్దులను అతిక్రమించడం అనేది అల్లాహ్ ను వదిలి లేదా అల్లాహ్ తో పాటు వాటిని పూజించే వైపుకు తీసుకు వెళ్తుంది. కనుక ప్రతి ఒక్కరూ బహుదైవారాధనకు దారితీసే అలాంటి ప్రతి ఒక్క మార్గము పట్ల, ప్రతి ఒక్క మూలము పట్ల మరియు ప్రతి ఒక్క కారణం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

సమాధులలో ఖననం చేయబడి ఉన్నవారు అల్లాహ్ కు ఎంత దగ్గరి వారైనా (ఔలియాలైనా), ఆ సమాధులకు గౌరవ ప్రతిష్ఠలు ఆపాదిస్తూ, వాటిని అలంకరించడానికి, వాటిని పూజించడానికి ఆ సమాధుల దగ్గరకు వెళ్ళరాదు.

సమాధులపై మస్జిదులు నిర్మించడం నిషేధించబడినది.

సమాధులపై మస్జిద్ నిర్మించబడి లేకున్నా, జనాజా నమాజు చదవబడని మృతుని కొరకు ఆచరించే జనాజా నమాజు తప్ప, సమాధుల వద్ద (స్మశానంలో) మరి ఏ ఇతర నమాజు అయినా ఆచరించుట నిషేధించ బడినది.

التصنيفات

బహుదైవారాధన (షిర్క్), మస్జిదుల ఆదేశాలు