.

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు: “నిశ్చయంగా కపటులపై అత్యంత భారమైన నమాజులు ఇషా మరియు ఫజ్ర్ నమాజులు. వాటిలో ఏమి (శుభము దాగి) ఉన్నదో ఒకవేళ వారికి తెలిస్తే, వారు (తమ కాళ్ళపై నడవలేక) ప్రాకుతూ రావలసి వస్తే, అలా ప్రాకుతూ అయినా వస్తారు. నిశ్చయంగా కొన్నిసార్లు నేనిలా అనుకున్నాను – సలాహ్ కొరకు ఆదేశించి (అదాన్ ఇవ్వమని ఆదేశించి), సలాహ్ ప్రారంభించమని చెప్పి (ఇఖామత్ పలుకమని ఆదేశించి), ఒక వ్యక్తిని ప్రజలకు నమాజు చదివించమని ఆదేశించి, తరువాత ఒక వ్యక్తిని కట్టెల మోపుతో నావెంట తీసుకుని బయలుదేరి, నమాజు కొరకు రాని వారి వైపునకు వెళ్ళి, వారిని వారి ఇళ్ళతో సహా తగులబెట్టాలని భావించినాను.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కపట విశ్వాసుల గురించి మరియు నమాజులు ఆచరించుటకు హాజరు కావడంలో – ప్రత్యేకించి ఇషా మరియు ఫజ్ర్ నమాజులు ఆచరించుటకు హాజరు కావడంలో - వారి సోమరితనాన్ని గురించి తెలియజేస్తున్నారు. మరియు వాటిలో ఎంతటి ప్రతిఫలం ఉన్నదో మరియు వాటిని ముస్లిములు జమా’అత్ తో ఆచరించుటకు హాజరు కావడంలో ఎంతటి పుణ్యం ఉన్నదో ఒకవేళ వారికి తెలిస్తే, పిల్లవాడు తన చేతులు మరియు మోకాళ్ళపై పాకిన విధంగా పాకుతూ అయినా వస్తారు అని తెలియజేస్తున్నారు. మరియు నిశ్చయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం "నమాజు కొరకు (అదాన్ ఇవ్వమని) ఆదేశించి, నమాజు ప్రారంభించుటకు (అఖామత్ ఇవ్వమని) ఆదేశించి, ఒక వ్యక్తిని తన స్థానములో ప్రజలకు ఇమామత్ చేయమని (నమాజు చదివించమని) ఆదేశించి, తరువాత కట్టెల మోపులతో ఒకవ్యక్తిని తన వెంట తీసుకుని, జమాఅత్’తో నమాజు ఆచరించుటకు రాకుండా (తమ ఇళ్లలోనే) ఉండి పోయిన వారి ఇళ్ళకు వెళ్ళి, వారిని వారి ఇళ్ళతో సహా తగులబెట్టాలని" నిశ్చయించుకున్నారు. ఎందుకంటే ఆ విషయములో (నమాజు కొరకు రాకుండా ఉండిపోవడంలో) వారు పాల్బడిన పాపము యొక్క తీవ్రత కారణంగా వారు అలా భావించినారు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా చేయలేదు, ఎందుకంటే ఇళ్ళలో స్త్రీలు, అమాయకులైన పిల్లలు మరియు ఇతరులు ఉంటారు కనుక, మరియు వారి భార్యాబిడ్డలపై దోషము ఏమీ లేదు కనుక.

فوائد الحديث

ఇందులో – జమాఅత్’తో (సామూహిక) నమాజు ఆచరించుటను వదిలివేయడం ఎంత భయంకరమైన విషయమో తెలియుచున్నది.

కపట విశ్వాసులు తమ కపటత్వము మరియు పేరుప్రతిష్ఠలు తప్ప తమ ఆరాధనల గురించి ఎపుడూ సంకల్పించరు. కనుక వారు నమాజు కొరకు రారు - ప్రజలు వారిని చూస్తున్నపుడు తప్ప.

ఫజ్ర్ మరియు ఇషా నమాజులు జమాఅత్’తో ఆచరించుట యొక్క ప్రతిఫలము చాలా గొప్పది, వాటి కొరకు ప్రాకుతూ రావలసి వచ్చినా అలా వచ్చి ఆచరించ దగిన ప్రాముఖ్యత కలిగిన నమాజులు అవి.

ఇషా మరియు ఫజ్ర్ నమాజులను సంరక్షించుట (వదలకుండా ఆచరించుట) కపటత్వము నుండి మనలను కాపాడుతుంది. మరియు వాటిని వదిలివేయడం కపట విశ్వాసుల లక్షణాలలో ఒకటిగా పరిగణించబడింది.

التصنيفات

కపటము, నమాజు ప్రాముఖ్యత