“వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పలవు గాక!”; అక్కడ ఉన్నవారు “ఎవరు, ఓ రసూలల్లాహ్?” అని…

“వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పలవు గాక!”; అక్కడ ఉన్నవారు “ఎవరు, ఓ రసూలల్లాహ్?” అని అడిగారు. దానికి ఆయన “ఎవరి జీవిత కాలములోనైతే అతని తల్లిదండ్రులలో, ఒకరు గానీ లేక ఇద్దరు గానీ, వృద్ధాప్యానికి చేరుకున్నారో, మరియు (వారికి సేవ చేయని కారణంగా) అతడు స్వర్గములోనికి ప్రవేశించలేదో అతడు.” అన్నారు

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పాలవు గాక! వాడు అవమానం పలవు గాక!”; అక్కడ ఉన్నవారు “ఎవరు, ఓ రసూలల్లాహ్?” అని అడిగారు. దానికి ఆయన “ఎవరి జీవిత కాలములోనైతే అతని తల్లిదండ్రులలో, ఒకరు గానీ లేక ఇద్దరు గానీ, వృద్ధాప్యానికి చేరుకున్నారో, మరియు (వారికి సేవ చేయని కారణంగా) అతడు స్వర్గములోనికి ప్రవేశించలేదో అతడు.” అన్నారు.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శాపనార్థాలు పెట్టినట్లుగా అతడికి తలవంపులు కలగాలని, అతడు అవమానం పాలు కావాలని, ఎంతగా దుఆ చేసినారు అంటే, చివరికి వారి ముక్కు మట్టిలో పెట్టినంతగా. అక్కడ ఉన్న వారు “ఎవరు అతడు ఓ రసూలల్లాహ్, మీరు అంతగా అతనికి వ్యతిరేకంగా దుఆ చేస్తున్నారు?” అని ప్రశ్నించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘ఎవరైతే తన తల్లిదండ్రులలో – ఒకరిని గానీ లేక ఇద్దరిని గానీ - తన జీవితములోనే వృద్ధాప్యానికి చేరుకోవడం చూస్తాడో, వారి పట్ల దయ, కరుణ కలిగి ఉండక, వారి పట్ల అవిధేయుడై ఉండి ఆ కారణంగా అతడు స్వర్గములోనికి ప్రవేశించలేడో – అతడు’ అన్నారు.

فوائد الحديث

తల్లిదండ్రుల పట్ల బాధ్యత గలవారై, విధేయులై ఉండడం సంతానం యొక్క విధి, అది వారు స్వర్గములో ప్రవేశించడానికి ఒక కారణం అవుతుంది, ప్రత్యేకించి వారు ముసలితనములో ఉన్నపుడు మరియు శక్తి క్షీణించిన దశలో ఉన్నపుడు.

తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపడం ‘కబీరహ్’ పాపములలో ఒకటి (ఘోరాతి ఘోరమైన పాపములలో ఒకటి).

التصنيفات

తల్లిదండ్రుల పట్ల ఉత్తమంగా మెలగటం యొక్క ప్రాముఖ్యతలు