నిశ్చయంగా నా ఉమ్మత్ లోని మగవారి కొరకు ఈ రెండూ హరాం (నిషేధము), వారి ఆడవారి కొరకు అనుమతించబడినవి.”

నిశ్చయంగా నా ఉమ్మత్ లోని మగవారి కొరకు ఈ రెండూ హరాం (నిషేధము), వారి ఆడవారి కొరకు అనుమతించబడినవి.”

అలీ బిన్ అబీ తాలిబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన ఎడమ చేతిలో పట్టు వస్త్రాన్ని, తన కుడి చేతిలో బంగారాన్ని పట్టుకుని, తన రెండు చేతులను పైకి ఎత్తి ఇలా అన్నారు: “నిశ్చయంగా నా ఉమ్మత్ లోని మగవారి కొరకు ఈ రెండూ హరాం (నిషేధము), వారి ఆడవారి కొరకు అనుమతించబడినవి.”

[దృఢమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఎడమ చేతితో ఒక పట్టు వస్త్రాన్ని లేదా దానిలోని భాగాన్ని తీసుకొని, తన కుడి చేతితో ఆభరణాల నుండి బంగారాన్ని లేదా అలాంటి దానిని తీసుకొని, అప్పుడు ఇలా అన్నారు: పట్టు మరియు బంగారం ధరించడం పురుషులకు నిషిద్ధం. కానీ అవి మహిళలకు అనుమతించబడినాయి.

فوائد الحديث

అల్ సిందీ ఇలా అన్నారు: (హరాం – నిషేధము): ఈ హదీథులో పురుషుల కొరకు పట్టు మరియు బంగారము హరాం (నిషేధము) అంటే దాని అర్థము వాటిని పురుషులు వస్త్రాలుగా, ఆభరణాలుగా ధరించుట నిషేధము. కానీ వాటిని వినియోగించుట అనుమతించబడినదే, అంటే ఉదాహరణకు: వాటిని ఖర్చు చేయుట, అమ్ముట, కొనుట మొదలైనవి పురుషులకూ, స్త్రీలకూ సమానంగా అనుమతించబడినవే. అయితే బంగారాన్ని పాత్రలు (గిన్నెలు, పళ్ళాలు మొ.) తయారు చేడానికి ఉపయోగించరాదు. అది స్త్రీలకు పురుషులకు అందరికీ హరాం (నిషేధించబడినది).

స్త్రీలకు అలంకారం మరియు సౌందర్యం మొదలైన వాటి అవసరం కారణంగా, ఇస్లామీయ షరియత్ లో వారి కొరకు విస్తృతి కనిపిస్తుంది.

التصنيفات

వస్త్రాధరణ మరియు అలంకరణ